Saturday, May 4, 2024

ప్రజల అభిమానమే జనసేన బలం

తప్పక చదవండి
  • తెలంగాణ యువత పరిగెత్తే పిడుగులు
  • మోడీ నాయకత్వం నచ్చే బిజెపికి మద్దతు
  • తెలంగాణలో జనసేన,బిజెపిలను గెలిపించాలి
  • కొత్తగూడెం సభలో పవన్‌ కళ్యాణ్‌ పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం : తాను తెలంగాణలో తిరగక పోయినా జనసేన ఉందంటే అది విూ అభిమానమేనని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జలయజ్ఞం దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికి పునాది పడిరదని వ్యాఖ్యానించారు. కౌలు రైతులను రైతులు కాదనడం బాగో లేదన్నారు. ధరణిలో లోపాలున్నాయని విమర్శించారు. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే తెలంగాణ యువత నష్ట పోతుందన్నారు. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత అని, పారిపోరుకుండా జెండా పట్టుకుని నిలబడతారని పవన్‌ అన్నారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం గ్రౌండ్స్‌లో బిజేపీ`జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో పవన్‌ మాట్లాడారు. సనాతన ధర్మం.. సోషలిజం రెండూ నడప గలిగేది జనసేన. బీఆర్‌ఎస్‌ని ఒక్కమాట అనక పోవడానికి కారణం నేను ఇక్కడ తిరగక పోవడం. దశాబ్దం వేచి చూశా. ఆంధ్రాలో అరాచకంపై పోరాటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాకు స్ఫూర్తి. తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుంది. మోదీ నాయకత్వ పటిమ నచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నా. ఎవ్వరు వచ్చినా రాక పోయినా దక్షిణాది నుంచి మోదీకి మద్దతుగా ఉంటానని గుజరాత్‌ వెళ్లి కలిశా. భవిష్యత్తు యువత అని చెప్పిన గద్దర్‌కు జోహార్లు. నిధులు, నీళ్ళు, నియామకాలు నినాదంతో వచ్చిన తెలంగాణ అనుకున్న స్థాయిలో లేదు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయగలిగేది మోదీ మాత్రమే. రెండు తెలుగు రాష్టాల్లో నిత్యం ఎన్నికల వాతావరణం అవాంఛనీయం. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలి. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా పేపర్‌ లీక్స్‌ లేకుండా ఉండాలంటే బీజేపీ రావాలని పవన్‌ పేర్కొన్నారు. భవిష్యత్తు యువత అని చెప్పిన గద్దర్‌కు జోహార్లని పవన్‌ అన్నారు. నిధులు నీళ్ళు నియామకాలు నినాదంతో వచ్చిన తెలంగాణలో అనుకున్న స్థాయిలో లేదని విమర్శించారు. తెలంగాణలో బీసీ నేతను ముఖ్యమంత్రి చేయగలిగేది మోదీ మాత్రమేనని, రెండు తెలుగు రాష్టాల్లో నిత్యం ఎన్నికల వాతావరణం అవాంఛనీయమని అన్నారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా పేపర్‌ లీక్స్‌ లేకుండా ఉండాలంటే బిజేపి రావాలన్నారు. తెలంగాణలో బిజెపిలో కలిసి ఎన్నికల బరిలో నిలిచామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కొత్తగూడెంలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఎపిలో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. తన ఇజం.. హ్యూమనిజమన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులు తనకు స్ఫూర్తి అని ప్రశంసించారు. బిజెపి పోటీ చేస్తున్న స్థానాల్లో జనసైనికులు మద్దతు ఇవ్వాలని పవన్‌ కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిరదని, తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు ఇచ్చారని పవన్‌ గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే ఎపి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని ధ్వజమెత్తారు. యువత అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే జనసేన అండగా నిలబడుతుందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న’ దాశరథీ కృష్టమా చార్యులు అంటే తనకు స్ఫూర్తి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, జనసేన తరఫున ఆయన గురువారం కొత్తగూడెం ప్రకాశం గ్రౌండ్స్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం, సోషలిజం రెండూ నడప గలిగేది జనసేన అని, బీఆర్‌ఎస్‌ ను ఒక్కమాట అనక పోవడానికి కారణం తాను ఇక్కడ తిరగక పోవడమేనని స్పష్టం చేశారు. దశాబ్దం వేచి చూసానని, ఆంధ్రాలో అరాచకంపై పోరాటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే తనకు స్ఫూర్తి అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటోందన్నారు. ప్రధాని మోదీనాయకత్వ పటిమ నచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నానన్నారు. ఎవ్వరు వచ్చినా రాక పోయినా దక్షిణాది నుంచి మోదీకి మద్దతుగా ఉంటానని అన్నారు. భవిష్యత్తు యువత అని చెప్పిన గద్దర్‌కు జోహార్లని పవన్‌ అన్నారు. నిధులు నీళ్ళు నియామకాలు నినాదంతో వచ్చిన తెలంగాణలో అనుకున్న స్థాయిలో లేదని విమర్శించారు. తెలంగాణలో బీసీ నేతను ముఖ్యమంత్రి చేయగలిగేది మోదీ మాత్రమేనని, రెండు తెలుగు రాష్టాల్లో నిత్యం ఎన్నికల వాతావరణం అవాంఛనీయమని అన్నారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాలని ఆయన ఆకాంక్షించారు. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్నా పేపర్‌ లీక్స్‌ లేకుండా ఉండాలంటే బిజేపి రావాలన్నారు. వైఎస్‌ జల యజ్ఞం దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికికు పునాది పడిరదని, కౌలు రైతులను.. రైతులు కాదనడం బాగో లేదన్నారు. ధరణిలో లోపాలున్నాయని, అభివృద్ధి ఆంధ్రాలో జరగక పోతే తెలంగాణ యువత నష్ట పోతుందని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు