Thursday, September 12, 2024
spot_img

కదులుతున్న మాల్దీవుల అధ్యక్ష పీఠం…

తప్పక చదవండి
  • అవిశ్వాసానికి పిలుపునిచ్చిన ప్రతిపక్షం
  • లక్షద్వీప్‌ లో ఇటీవల మోడీ పర్యటన
  • లక్షద్వీప్‌ ను ప్రోత్సహించాలనేలా ట్వీట్లు
  • అక్కసు వెళ్లగక్కిన మాల్దీవుల నేతలు
  • మండిపడుతున్న భారతీయులు

ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌ ను ప్రోత్సహించాలని చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల అధికార పక్ష నేతలు విషం చిమ్మడం తెలిసిందే. అయితే ఎవరూ కూడా మాల్దీవుల అధికార పక్షానికి మద్దతు ఇవ్వడంలేదు. మద్దతు సంగతి అలా ఉంచితే, మాల్దీవుల దేశాధ్యక్ష పీఠం కదులుతోంది. భారత్‌ పట్ల, భారత ప్రధాని పట్ల మాల్దీవులుకు చెందిన మంత్రులు, ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలు.. మాల్దీవులు ప్రభుత్వంపై.. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జూపై భారత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత, ఒత్తిడి నెలకొంది. ఇప్పుడు ఇవే అంతర్గతంగా కూడా అక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. దీంతో అధికార పార్టీపై అక్కడి ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది. భారత్‌తో వివాదాన్ని తెచ్చుకోవడం మాల్దీవులకు మంచిది కాదని సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాల్దీవుల్లోని ప్రతిపక్ష పార్టీ అధినేత అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జూపై అవిశ్వాసానికి పిలుపునిచ్చారు. మహ్మద్‌ మొయిజ్జూపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న వేళ.. ఆ అవకాశాన్ని అక్కడి ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. అదే అదునుగా మొయిజ్జూను అధికారం నుంచి తప్పించే పనిలో పడ్డాయి. మాల్దీవుల్లోని పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్‌.. అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జూపై అవిశ్వాస తీర్మానానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న మొయిజ్జూను అధికారం నుంచి తొలగించాలని కోరారు. మాల్దీవులు దేశ విదేశాంగ విధానం యొక్క స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలీ అజీమ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో అలీ అజీమ్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జూను అధికారం నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అలీ అజీమ్‌ తెలిపారు. అలాగే మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను దెబ్బ తీసేలా మహ్మద్‌ మొయిజ్జూ పని చేస్తున్నారని అలీ అజీమ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌ పర్యటనపై పలువురు మాల్దీవుల మంత్రులు సోషల్‌ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో మోడీపై వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్‌.. సోమవారం ఢల్లీిలోని మాల్దీవుల రాయబారిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పిలిపించి.. సమన్లు జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు