Sunday, April 21, 2024

ఫార్మూలా రేస్‌తో లాభం లేదు

తప్పక చదవండి
  • ఈ రేసింగ్‌ నిర్వహణతో జీరో బెన్ఫిట్‌
  • రూ. 110 కోట్లు రాష్ట్ర ధనం వృధా
  • ఓ కంపెనీకి లబ్ది చేకూర్చడానికే రేసింగ్‌
  • టికెట్లు అమ్ముకుని లాభపడ్డ ఓ కంపెనీ
  • ఐఎఎస్‌ అరవింద్‌ కుమార్‌కు నోటీసులు
  • వెల్లడించిన డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క
  • విడతలవారీగా రైతుబంధును అమలు
  • ఎకరా, రెండెకరాల వారికి ముందుగా చెల్లింపు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్‌ ఒప్పందానికి సంబంధించి విక్రమార్క విమర్శలు చేశారు. ఆ ఈవెంట్‌ అనేది ఓ కంపెనీకి లబ్ది చేకూర్చడం కోసమే పెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రాన్ని పచ్చిగా అమ్మకానికి పెట్టిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫార్ములా రేసుతో రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదని ప్రశ్నించారు. ఓ కంపెనీకి లబ్ది చేయడం కోసమే ఫార్ములా రేసు నిర్వహించారని.. దాన్ని వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా నిర్వహించారని ఆరోపించారు. ఈ రేసుకు రూ.110 కోట్లు కట్టారని.. ఇప్పుడు తాము ఫార్ముల ఈరేసు రద్దు చేయడంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌ రద్దు కావడంపై మాజీ మంత్రుల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని.. ప్రతిపైసా ప్రజల అవసరాల కోసం మాత్రమే తాము ఖర్చు చేస్తామని వివరించారు. గత ప్రభుత్వ తప్పిదాలను తాము కచ్చితంగా సరిచేస్తామని అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే కఠన చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హెచ్చరించారు. సెక్రటరియేట్‌ బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం ఫార్ములా ఈరేస్‌కు అనుమతి లేదని భట్టి విక్రమార్క అన్నారు. వాళ్లు ఎవరో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా అని ప్రశ్నించారు. ఇది బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధమైనదని భట్టి అన్నారు. ప్రతి పైసా రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్‌ నిర్వహించడం వల్ల ఎలాంటి ఆదాయం ఉండదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ట్రాక్‌ సదుపాయం కల్పించాలని అన్నారు. గత ప్రభుత్వం ట్రై పార్టీ ఒప్పందాన్ని బై పార్టీ అగ్రిమెంట్‌ గా మార్చిందని భట్టి ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ రేస్‌ కు సంబంధించి ప్రభుత్వం రూ.110 కోట్లు చెల్లించాలని, ఈ రేస్‌ కు డబ్బులు చెల్లించి అనుమతులు ఇప్పించాలని ఒప్పందంలో ఉందని తెలిపారు. ఈ రేసింగ్‌ ఈవెంట్‌ కు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేస్తోంది. 2023 ఫిబ్రవరిలో అప్పుడున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లతో ఫార్ములా ఈ రేసింగ్‌ నిర్వహించింది. ఈ వ్యవహారంలోనే ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు ప్రభుత్వం మంళవారం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అప్పుడు కుదిరిన కాంట్రాక్టులోని కొన్ని అంశాలపై పూర్తిగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆ మెమోలో కోరింది. ఫార్ములాఈతో తైప్రాక్షిక లాంగ్‌ ఫోరమ్‌ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని వివరణ అడిగింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.54 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారనే ఆరోపణలు ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌పై ఉన్నాయి.

తప్పుడు కథనాలను ప్రజలు నమ్మొద్దు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అభయహస్తం దరఖాస్తులు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై కనిపించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు ఎక్కడికి పోవని తేల్చి చెప్పారు.. కొన్ని పత్రికలు పనిగట్టుకుని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ప్రజలు వాటిని నమ్మొద్దని భట్టి పేర్కొన్నారు. దీనిపై అనవసర ప్రచారం చేయొద్దని సూచించారు.మరోవైపు దరఖాస్తులు రోడ్డుపై కనిపించడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. ఘటనకు బాద్యులైన హయత్‌ నగర్‌తోపాటు కుత్బుల్లాపూర్‌కు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్లను వారి టీమ్‌ లీడర్స్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కమిషనర్‌ వారిని సస్పెండ్‌ చేశారు.

- Advertisement -

విడతలవారీగా రైతుబంధును అమలు
విడతలవారీగా రైతుబంధును అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతుబంధుకి రోజు వారీగా నిధులు విడుదల చేస్తామన్నారు. ఒక ఎకరం వరకు రైతు బంధు అకౌంట్స్‌లో జమ అయ్యిందని.. 2 ఎకరాల వారికి రైతు బంధు పడుతోందని తెలిపారు. విడుతల వారీగా నిధులు విడుదల చేసి రైతు బంధు ఇస్తామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ వాళ్ళు హామీలు చేయక పోతే బాగుండు అని బీఆర్‌ఎస్‌ నేతలు కోరుకుంటున్నారని భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు. ప్రజాభవన్‌లో ఎవరైనా రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కలవొచ్చని అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టు ఇస్తామని అన్నారు ఇచ్చారా? అని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌లు అన్నారు హామీ గత ప్రభుత్వం ఏమి చేసిందని నిలదీశారు. తాము సంపదని సృష్టిస్తామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు