Wednesday, February 28, 2024

చెన్నైషాపింగ్ మాల్ లో తల్లీ కూతుళ్లపై లైంగిక దాడి..

తప్పక చదవండి
  • ఈ సంఘటనపై యాజమాన్యంపై ఫోక్సో కేసు నమోదు..
  • హనుమకొండలో చోటుచేసుకున్న దారుణ ఘటన..

హైదరాబాద్ : హనుమకొండ చెన్నై షాపింగ్ మాల్ లో తల్లీ కూతుళ్లపై జరిపిన భౌతిక, లైంగిక దాడి ఉదంతంలో సిబ్బంది, యాజమాన్యంపై సుబేదారి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ నెల 18 వ తేదీన సాయంత్రం షాపింగ్ మాల్ కు చేరుకున్న తల్లీ, కూతుళ్లపై సిబ్బంది దొంగతనాన్ని ఆపాదించడమే కాకుండా వారిని గదిలో3 గంటలు నిర్బంధించి లైంగికంగా దాడి చేసిన ఘటనపై బాధితులు మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తెలిపారు.. తదనంతరం సంభందిత పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం రావాల్సిందిగా పోలీసులు తెలియజేయడంతో.. బాధిత మహిళలకు అండగా పలు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, బీఎస్పీ, బీజేపీ నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.. బాధితుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు 342, 290, 323, 384, 354 B, 506 r/w 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.. దర్యాప్తు విధానంతో సమ్మతించని నాయకులు హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ని కలిసి చిన్నారిపై జరిగిన లైంగిక దాడికి పోక్సో చట్టాన్ని అమలుచేయాలని అభ్యర్ధించారు.. కలెక్టర్ చొరవతో వెంటనే పోలీసులు పోక్సో చట్టం ప్రకారం షాపింగ్ మాల్ యాజమాన్యంపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు..

తదనంతరం బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అండతో కొనసాగుతున్న కార్పోరేట్ షాపింగ్ మాల్ ల అహంకార వైఖరికి ఈ ఉదంతం నిలువుటద్దం అన్నారు.. దారుణమైన ఈ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకురావడానికి బాధిత మహిళ చూపిన ధైర్యాన్ని అభినందించారు.. మహిళలు ఎక్కడైనా ఎప్పుడైనా షాపింగ్ చేస్తున్న సమయంలో అసౌకర్యానికి గురైనా, యాజమాన్యం ఇబ్బంది పెట్టినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.. తెలంగాణ ప్రభుత్వం చేనేత సహకార సంఘం ఉత్పత్తులను, వస్త్రాలను విక్రయించడానికి అవసరమైన టెస్కో షోరూమ్లను పెంచకుండా కార్పొరేట్ షాపింగ్ మాల్ లకు రెడ్ కార్పెట్ పరుస్తుందనీ అందుకే ఇటువంటి ఉదంతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సినీ తారల ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని షాపింగ్ మాల్ లు వినియోగదారులపై దాష్టీకాలకు పాల్పడుతున్నారన్నారు. సినీ తారలు నిబంధనలకు వ్యతిరేకంగా నకిలీ చేనేత వస్త్రాలను విక్రయించే కార్పొరేట్ షాపింగ్ మాల్ లకు ప్రచారం నిర్వహిస్తే ఐటీ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామనీ, ప్రజలు ఇటువంటి సంఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు..

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీ రాములు మాట్లాడుతూ షాపింగ్ మాల్ సంస్కృతితో సహజమైన చేనేత పట్టు సహకార సంఘాలు నిర్వీర్యమైనాయన్నారు.. తెలంగాణ ప్రభుత్వ అసమర్ధ పాలనతోనే షాపింగ్ మాల్లు ప్రజలను దోచుకుంటున్నాయన్నారు.. షాపింగ్ మాల్ లలో కొనసాగుతున్న దాష్టీకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. వినియోగదారులు డ్రెస్సింగ్ రూమ్లలో సీసీ కెమెరాలు లను పరిశీలించాలన్నారు.. ప్రభుత్వ సంస్థలైన టెస్కో షోరూములు విరివిగా ప్రారంభిస్తే షాపింగ్ మాల్ ల బెడద మహిళలకు ఉండదన్నారు.. ప్రభుత్వ వైఫల్యంతోనే షాపింగ్ మాల్ లో ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జరిగిన ఈ ఉదంతంపై ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు..

ఈ కార్యక్రమానికి బీసీ రాజ్యాధికార సమిత్ రాష్ట్ర కమిటీ సభ్యులు దామెరకొండ కొమురయ్య, అధికార ప్రతినిధి సాయిబాబా, బహుజన సమాజ్ పార్టీ మహిళా జోనల్ కన్వీనర్ కొల్లూరు రజిత, అట్లూరి పద్మ, హన్మకొండ జిల్లా కన్వీనర్స్ హనుమకొండ సుజాత, వరంగల్ జిల్లా కన్వీనర్ బోసు రాజేశ్వరి, జిల్లా నాయకులు జన్ను అనిల్, వర్ధన్నపేట ఇన్చార్జి, కార్యనిర్వాహకులు మాదారపు రవికుమార్, తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ చిత్రపు పుష్పతలయ, వరంగల్ తూర్పు నియోజకవర్గం జన్ను భరత్, ప్రధాన కార్యదర్శి కొడకండ్ల శ్యాంసుందర్, కార్యదర్శి శ్రీకాంత్, మండల కన్వీనర్ జన్ను నీలిమ, మాదాసి రాజకుమార్, పరకాల నియోజకవర్గం అధ్యక్షులు వెలుతురు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎండీ అంజద్ పాషా, నాయకులు పెండ్యాల మహేందర్, తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు