Saturday, July 27, 2024

ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టాలి

తప్పక చదవండి
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
  • మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
  • అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారిన పోలీసులు

మిర్యాలగూడ : వచ్చే ఎన్నికల్లో మద్యం,డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు తీసుకొని వాటి ప్రభావాన్ని అరికట్టాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ జాడీ రాజు ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మద్యం,డబ్బు ఏరులై పారినా వాటిని అరికట్టడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో బీఅర్‌ఎస్‌,బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలు ఆచరణకు సాధ్యం కానీ అబద్ధపు హామీలతో, మోసపూరిత మేనిఫెస్టోలతో ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రజలేవరు ఇలాంటి బూటకపు మ్యానుఫ్యాక్చర్లను నమ్మొద్దని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామాలకు అత్యధిక నిధులు కేటయించాలని పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం అధికార దుర్వినియోగమేనన్నారు.మంత్రి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.తక్షణమే ఎన్నికల సంఘం మంత్రిపై చర్యలు తీసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించాలన్నారు. సూర్యాపేట,ఆసిఫాబాద్‌ జిల్లా ఎస్పీలు అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా మారి,ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి, బెదిరిస్తున్నారని దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ప్రభుత్వం ఐఏఎస్‌ పై పాత తేదీతో కాంట్రాక్టర్లకు నిధుల విడుదలకు సర్కులర్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు. అధికారులు తప్పులు చేస్తే భవిష్యత్‌ లో ప్రజా కోర్టులో శిక్షలు వేస్తామన్నారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో, పవర్‌ ప్లాంట్‌ ను పూర్తి చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. నల్లగొండ జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ (డీసీఎంఎస్‌) వట్టే జానయ్యపై అక్రమ కేసులు పెట్టించడం వెనుక మంత్రి జగదీశ్‌ రెడ్డి హస్తం ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఎటువంటి ఆధారాలు లేకుండానే వట్టే జానయ్య యాదవ్‌ పై మంత్రి ప్రోద్బలంతో అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. ఇటీవల ఆనారోగ్యానికి గురై మిర్యాలగూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జున సాగర్‌ బీఎస్పీ ఇంచార్జ్‌ ఆదిమల్ల వెంకటేశ్వర్లును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఎస్పి నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు