Thursday, May 16, 2024

మంత్రి ముందస్తు పంటసాగు విజయవంతం..

తప్పక చదవండి
  • స్వయంగా వరి విత్తనాలను వెదజల్లిన మంత్రి..
  • నేడు స్వగ్రామం నాగారంలో పంట కోసిన మంత్రి..
  • 132 రోజుల్లోనే చేతికొచ్చిన పంట..
  • మార్చిలోపు పూర్తికానున్న పంట కాలం..

సూర్యాపేట : రోహిణి కార్తె పూర్తయ్యే నాటికి నాట్లు పడాలని, పంట సాగును ముందుకు జరపాలి తద్వారా నవంబర్‌ రెండో పంటకు ప్రకృతి వైపరీత్యాల తాకిడి ఉండదు అనే ప్రభుత్వ అలోచననను రైతు బిడ్డగా నిజం అనేలా రుజువు చేశారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని తన స్వగ్రామం నాగారం వ్యవసాయ క్షేత్రం లో స్వయంగా జూన్‌ 4 న రోహిణి కార్తే లో మంత్రి జగదీశ్‌ రెడ్డి ఖర్చు లు తగ్గించుకునేందుకుగాను వెదజల్లే పద్దతిలో సాగు చేసిన వరి సాగు ప్రకృతి విపత్తులను అధిగమించి,చీడపిడలను దాటవేసి అద్భుత దిగుబడి వచ్చింది. నేడు అదే వ్యవసాయ క్షేత్రంలో తమ కుల దేవతలకు ప్రత్యేక పూజలు చేసి పంట కోతకు శ్రీకారం చుట్టారు. పంటసాగు ముందుకు జరిపిన మంత్రి 132 రోజుల్లోనే విజయవంతం గా సాగు పూర్తి చేశారు. ఎకరాకు 40 బస్తాల దిగుబడి సాధించారు.

రబీ సాగు ను నవంబర్‌ లో ప్రారంభించడం ద్వారా మార్చి లోపు పూర్తి కానుంది. తద్వారా రైతులకు నష్టం చేకూరుస్తున్న వడగళ్లు, అకాల వర్షాలు, దోమపోటు వంటి చీడపీడల నుండి పంట లను కాపాడుకోవడానికి సాగు ను ముందుకు జరుపడమే ప్రత్యామ్నాయం అనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనను అమలు చేసిన మంత్రి, రైతు బిడ్డగా, తోటి రైతులకు ఆదర్శంగా సాగుచేసిన వరి పంట సాగు విజయవంతం అయింది.
క్షేత్రమంతా కలియతిరిగి పొట్టెళ్ళను పరిశీలించి..
వరి పంట కోతను ప్రారంభించడానికి ఇచ్చిన మంత్రి, తమ కులదైవాలకు ప్రత్యేక పూజలు చేశారు.వరి కోతను ప్రారంభించిన అనంతరం వ్యవసాయ క్షేత్రంలో కలియ తిరిగారు. తమ పొలంలో పెంచుకుంటున్న పొట్టేలను కాసేపు మేపిన మంత్రి, వాటిని ప్రేమగా నిమురుతూ మూగజీవాలపై తనకున్న ప్రేమను చాటిచెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు