Wednesday, May 15, 2024

ఎక్స్‌ కార్ప్‌ సేవలకు బ్రేక్..

తప్పక చదవండి
  • ధృవీకరించిన డౌన్‌ డిటెక్టర్‌..!
  • ఇలా జరగడం ఇది నాలుగోసారి..

న్యూ ఢిల్లీ : మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ‘ఎక్స్‌’ సేవలు ఆదివారం నిలిచిపోయాయి. ట్వీట్‌ చేయడం, రీ ఫ్రీష్‌ చేయడంలో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే చాలా మందికి తమ టైమ్‌లైన్‌ సైతం చూడలేకపోయారు. డౌన్‌ డిటెక్టర్‌ సైతం ఎక్స్‌ కార్ప్‌ సేవలు డౌన్‌ అయ్యాయని నిర్ధారించింది. ట్విట్టర్‌లో సేవల అంతరాయంపై పలువురు ట్వీట్‌ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సేవల్లో అవాంతరాలు ఎదురైనట్లుగా డౌన్‌ డిటెక్టర్‌ పేర్కొంది.

ఈ సమయంలో యాప్‌ను ఉపయోగించినా.. వెబ్‌ వెర్షన్‌లో టైమ్‌లైన్‌ వీక్షించడంలో యూజర్లకు సమస్యలు ఎదురైనట్లు తెలిపారు. ట్వీట్స్‌ను చూస్తున్న సమయంలో.. పోస్ట్‌ల కోసం సెర్చ్‌ చేస్తున్న సమయంలో సమస్యలు ఎదురైనట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు నెలల కింద ట్విట్టర్‌ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు ప్రపంచవ్యాప్తంగా సేవలు నిలిచిపోయాయి. డౌన్‌ డిటెక్టర్‌ ప్రకారం దాదాపు 4వేల మందికిపైగా ట్విట్టర్‌లో సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదించారు. వైబ్‌సైట్‌, యాప్‌, లాగిన్‌లో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సేవలు నిలిచిపోవడం ఇది నాలుగో సారి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు