Wednesday, September 11, 2024
spot_img

బ్రెజిల్‌లో కుప్పకూలిన విమానం..

తప్పక చదవండి
  • సిబ్బందితో సహా 14 మంది స్పాట్ డెడ్..

రియో డి జెనీరో: బ్రెజిల్‌లోని ఉత్తర అమెజాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బార్సెలోస్ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్ అమెజాన్‌లో చిన్న విమానం కుప్పకూలింది. దీంతో 14 మంది మరణించారు. వారిలో ఇద్దరు పైలెట్లు కూడా ఉన్నారు. 12 మంది ప్రయాణికులు ఫిషింగ్‌ స్పోర్ట్‌ కోసం మానౌస్‌ నుంచి బార్సిలోస్‌కు ఈఎంబీ-110 అనే చిన్న విమానంలో వెళ్తున్నారు. అయితే వర్షం కారణంగా విమానాన్ని దించడానికి పైలట్లు ప్రయత్నించారు. దీంతో అది ప్రమాద వషాత్తు కూలిపోయిందని అమెజానాస్‌ రాష్ట్ర గవర్నర్‌ విల్సన్ లిమా సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో తెలిపారు. విమాన ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు వెళ్లడించారు. అది రెండు ఇంజిన్ల విమానమని, దీనిని బ్రెజిలియన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీదారు ఎంబ్రైర్‌ అనే కంపెనీ తయారు చేసిందని చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. మృతుల్లో అమెరికాకు చెందిన పౌరులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు