- తుఫాన్ ధాటికి నేలకొరిగిన చెట్లు
- కూలిన కరెంట్ స్తంభాలు..పలుచోట్ల విద్యుత్ అంతరాయం
- కొట్టుకు పోయిన గుడిసెలు..నీటమునిగిన పంటలు
- తీరప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు..!
- తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణశాఖ హెచ్చరిక
విశాఖపట్నం (ఆదాబ్ హైదరాబాద్) : తుఫాన్ మిచౌంగ్.. తీరం దాటింది. చీరాల, బాపట్ల మధ్య.. తీరం దాటింది. తీరం దాటే సమయంలో 110 కిలోవిరీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి.. విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగిపోయాయి. కరెంట్ సరఫరా నిలిచింది. తీరానికి 10 కిలోవిరీటర్ల పరిధిలోని ఉన్న గ్రామాల్లోని పూరిళ్లు కూలిపోయాయి. తీరం సవిరీపంలో.. రోడ్లపై ఉన్న చిన్న తాత్కాలిక దుకాణాలు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వందల సంఖ్యలో రైలు సర్వీసులను రద్దు చేశారు అధికారులు. మచిలీపట్నం నుంచి చెన్న్కె వరకు సముద్రం 30 విరీటర్లు ముందుకు వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నెల్లూరు, కావలి మధ్య తీరాన్ని తాకిన మిచౌంగ్ తుఫాన్.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాపట్ల, చీరాల మధ్య తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిరది. ఈదురుగాలులకు తీవ్ర నష్టం వచ్చింది. తుఫాను ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్న్కె, నెల్లూరు జిల్లాలో గాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షాలు కొనసాగనున్నాయి. తుఫాను ఉత్తర దిశగా నెమ్మదిగా ముందుకు కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోవిరీటర్లు కొన్నిసార్లు 110 కిలోవిరీటర్లు గాలులు వీచనున్నాయి. ముంపు ప్రాంతాల్లో సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు. ఇటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఓ మోస్తారుగా కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. తుపాను దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవిరీక్ష నిర్వహించారు. ఈ మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ’ బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలన్నారు. నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి. తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలి. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని సీఎంకు అధికారులు వివరించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఆ జిల్లాల్లో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని వెల్లడిరచారు. అదే సమయంలో ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9,500 మందిని తరలించినట్లు అధికారులు వెల్లడిరచారు. తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనూ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. ఏపీలోని 10 జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. రాబోయే 24 గంటలు అంటే..బుధవారం రాత్రి వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని.. అతి భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. మిగ్‌జాం తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలుకు 25 కి.విరీ, బాపట్లకు 60 కి.విరీ, మచిలీపట్నానికి 130 కి.విరీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.విరీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. తుపాను తీరం దాటి సమయంలో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడిరచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు, ఇప్పటివరకూ 211 సహాయక శిబిరాల్లో 9,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో నెల్లూరు, బాపట్ల, ప్రకాశం సహా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తుపాన్ కారణంగా తీరప్రాంతాల్లో ఈదురు గాలులతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉదయం 6.30 గంటల వరకు బాపట్లలో 21.36 సెంటీవిరీటర్ల వర్షపాతం నమోదవగా, నెల్లూరు 28.95, మచిలీపట్నం 14.93, కావలి 14.26, ఒంగోలు 11.44, కాకినాడ 5.9, నర్సాపూర్ 5.85, అనకాపల్లి 3.35, పొదలకూరు 20.75, రేప్లలె 1.17, చిత్తూరు 1.25, నర్సారావుపేట 1.15 సెం.విరీల చొప్పున వర్షపాతం నమోద్కెనట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే నిజాంపట్నం హార్బర్ లో అధికారులు పదో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, గడిచిన 20 సంవత్సరాల్లో నిజాంపట్నం హార్బర్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి. ప్రకాశం జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురు స్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొల్లూరు మండలం తోకలవానిపాలెంలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. తీవ్ర గాలులతో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమహేంద్ర వరం, రాజానగరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, అమలాపురం మండలాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జగ్గంపేట, పత్తిపాడు, తుని మండలాల్లో ఈదురుగాలులతో వరిపంట నేలకొరిగింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. 9 మండలాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, కావలి, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. వర్షం, ఈదురుగాలులతో చలి తీవ్రత పెరిగిపోయింది. విజయవాడలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇంద్రాకీలాద్రి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లా దివిసీమలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుం డడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పంట పొలాల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒక్కో గేటును ఎత్తి టీటీడీ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
: వాతావరణశాఖ హెచ్చరిక
మిచౌంగ్ తుఫాను తీరం దాటి ముంచుకొస్తున్న తరుణంలో.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా.. మంగళ, బుధవారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే వీలుందని.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడిరచింది. నేపథ్యంలోనే.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రెండు జిల్లాలకు ఒక్కోటి చొప్పున ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపాలని పేర్కొంది.
మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తున్నాం. ఇప్పటికే నిండిన చెరువులకు గండ్లు పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా భారీ ఆయా జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. నీటిపారుదల, విపత్తు నిర్వహణ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇదే సమయంలో సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో మిచౌంగ్ తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. అధికారులు వెంటనే అలర్ట్ అవ్వాలన్నారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని.. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.