Sunday, October 13, 2024
spot_img

భారీ ఎత్తున బ్లాస్టింగ్ లు

తప్పక చదవండి
  • సెల్లార్ నిర్మాణాల కోసం బరితెగింపు..
  • ఇష్టారాజ్యంగా సెల్లార్ల తవ్వకాలు.. మట్టి అమ్మకాలు..
  • ప్రభుత్వానికి రూ. కోట్ల ఆదాయం గండి..
  • బ్లాస్టింగులతో గిరి పడుతున్న బండరాళ్లు..
  • పట్టించుకోని అన్ని శాఖల అధికారులు..
  • విచ్చలవిడిగా నిర్మాణాలు.. ఆపై వ్యాపార సముదాయాలు..
  • కాసులు వెదజల్లితే చాలు అన్నీ సర్డుకుపోతాయి..

ఇబ్రహీంపట్నం : అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారుల ఉదాసీన వైఖరికి ముడుపుల వ్యవహారమే ప్రధాన కారణం. విచ్చలవిడిగా నిర్మాణాలు జరిగి సెల్లార్లలో వ్యాపారాలు కొనసాగుతున్నాయంటే.. అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతోంది. సెల్లార్ల నిర్మాణాల వ్యవహారంలో అక్రమ బాగోతం జోరుగా కొనసాగుతోంది. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. ఈ తతంగం అంతా .. అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటిలోని, తట్టి అన్నారంలో జరుగుతోంది.. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఆరు ఎకరాల భూమిలో సెల్లార్ల తవ్వకం జరుగుతోంది.. రోజుకు పదుల సంఖ్యలో టిప్పర్ల మట్టిని పోటాపోటీగా నాలుగు ఎగ్జాకవేటర్ లు పెట్టి మరీ బయటికి తరలించి విక్రయిస్తున్నారు. నాగోల్ – బండ్లగూడ మార్గంలో ఓ నిర్మాణ సంస్థ ఆరెకరాల విస్తీర్ణంలో భారీ సెల్లార్ నిర్మాణానికి తవ్వకం చేపట్టింది. హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందినా.. తవ్వకాల్లో కనీస భద్రతాప్రమాణాలు పాటించడం లేదు. రాత్రి, పగలు తేడా లేకుండా బ్లాస్టింగ్స్ నిర్వహిస్తున్నారు. సామర్థ్యానికి మించి జిలెటిన్ స్టిక్స్ వాడుతుండడంతో పేలుళ్ల ధాటికి పెద్దపెద్ద బండరాళ్లు ఎగిరి వచ్చి పక్కనే ఉన్న ఇళ్లపై పడుతున్నాయి. అటుగా గౌరెళ్ళి, కుత్బుల్లాపూర్, కుంట్లూరు, తట్టి అన్నారం ప్రజలు వేల సంఖ్యలో ఆ నిర్మాణ సంస్ధ ముందు నుంచే రాకపోకలు కొనసాగిస్తారు. సెల్లార్ తవ్వకం పక్కనే ఉన్న ఆర్టీసి డిపో, సమీపంలోనే పెట్రోల్ బంకులు, వాహనదారులు, బాటసారులకు సైతం కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు బ్లాస్టింగ్ అవుతుందో, ఎక్కడ నుంచి వచ్చి బండరాళ్లు పడతాయో అని భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల స్థానికులు ఎస్ఓటీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్ధానికులు అంటున్నారు. ఇలా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

సెల్లార్‌ అనుమతులు ఇలా..
రెండు, అంతకుమించి అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్న సమయంలో సెల్లార్‌ నిర్మాణం కోసం జీ.హెచ్.ఎం.సి., మున్సిపల్‌, హెచ్ఎండిఏ అనుమతులు విధిగా తీసుకోవాలి. సెల్లార్ కోసం తవ్వకాలు జరిపాలనుకుంటే ఆ స్థలం యొక్క మట్టిని పరిశీలించి రిపోర్ట్స్‌, అగ్నిమాపక అనుమతులు, బ్లాస్టింగ్ కోసం పోలీస్ అధికారులు అనుమతులు తప్పనిసరి.. భవనం నిర్మాణం అయిన తరువాత ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఆ భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగే విధంగా ఉండాలి….

- Advertisement -

బ్లాస్టింగ్ రాళ్ళు వచ్చి మీద పడ్డాయి : గ్యార నర్సింహ మాదిగ (గౌరెళ్లి గ్రామస్తుడు)

గౌరెళ్లి నుంచి హైదరాబాద్ కు బైక్ పై వెళ్తున్న క్రమంలో ఆ సెల్లార్ వద్దకు రాగానే బ్లాస్టింగ్ ఐయ్యింది. పేలిన రాళ్ళు చిన్న చిన్న ముక్కలు వచ్చి తగిలాయి. బ్లాస్టింగ్ జరుగుతున్న విషయం గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. జనావాసం మధ్యలో ఉన్న సెల్లార్ కి బ్లాస్టింగ్ కోసం అధికారులు పర్మిషన్ లు ఎలా ఇచ్చారు..? అసలు పర్మిషన్స్ ఉన్నాయా..? అర్దం కావడం లేదు.. అధికారులు తక్షణమే స్పందించి బ్లాస్టింగ్ కి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు