- దాతరాపల్లి దగ్గరలో యాదాద్రి పాత నారసింహస్వామి సాక్షిగా దగా..
- శుభమస్తు టౌన్ షిప్స్ పేరుతో మూడు సంవత్సరాల క్రితమే మొదలైన మోసం..
- మార్వెల్ సిటీ 1 పేరుతో వందల్లో హోటల్స్ షూట్ రూమ్స్ అని చెబుతూ దందా..
- ఎలాంటి అనుమతులు లేకుండా ప్రీలాంచ్ లోనే అమ్మేసిన వైనం..
శుభమస్తు అని పేరుపెట్టుకుని అమాయకులను టార్గెట్ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న శుభమస్తు టౌన్ షిప్ వారి అక్రమ భాగోతాలు చూస్తుంటే మతిపోక తప్పదు..
హైదరాబాద్ : నెలసరి రెంటల్ ఇన్కమ్ గ్యారెంటీ అని చెబుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఏజెంట్లను నియమించుకుని, వారి ద్వారా మొత్తం ప్రాజెక్టును అమ్మేశారు..
అయితే ఇప్పటికి మూడు సంవత్సరాలైనా మార్వెల్ సిటీ 1 అనే ప్రాజెక్టు సగం కూడా పూర్తి చేయకపోవడం అమానుషమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
మరి రెండున్నర సంవత్సరాల్లోనే ప్రాజెక్టు మొత్తం పూర్తిచేసి, కొన్నవారికి అప్పజెబుతామని చెప్పిన మాటలు గాల్లో కలిసిపోయినట్లేనా..? తాజాగా ఇప్పుడు హోటల్ షూట్ రూమ్స్ స్థానంలో కమర్షియల్ స్పేస్ అని చెబుతూ.. ప్రముఖ స్టార్ హోటల్ అయినటువంటి లెమన్ ట్రీ.. తోటి పార్ట్నర్ షిప్ అగ్రిమెంట్ అయ్యిందంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ.. కొంతమంది ఏజెంట్లను నియమించుకుని అమ్మినదాన్నే తిరిగి అమ్ముతున్నారు..
కొసమెరుపు ఏమిటంటే వచ్చిన అనుమతులు దేనికి..? షూట్ రూమ్స్ కా.. కమర్షియల్ స్పేస్ కా..? అసలు అక్కడ కడుతున్న ప్రాజెక్టు ఏమిటి..? రేరా అనేది ఈ ప్రాజెక్టుకు గానీ, ఈ కంపెనీకి గానీ ఉన్నదా లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోయిది.. ఇకపోతే మర్వెల్ సిటీ 2..పేరుతో రెండు సంవత్సరాల క్రితమే మర్వెల్ సిటీ 1 కు దగ్గరలోనే 2 ఎకరాలలో షూట్ రూమ్స్ కాన్సెప్ట్ తోనే ప్రీ లాంచ్ లో అమ్మేసి చేతులు దులుపుకున్నారు.. ఇంత వరకూ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మభ్యపెట్టారు.. దీని గురించి బుక్ చేసుకున్న కస్టమర్లు గానీ, బుక్ చేయించిన ఏజెంట్లు గానీ శుభమస్తు మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పుకుంటున్న శేఖర్ గౌడ్, విజయ్ రెడ్డి లను ప్రశ్నిస్తే వారు ఇదిగో, అదిగో అని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు.. అసలు రేరా ఏమిచేస్తోంది..? ఇక్కడ కొన్నవారి పరిస్థితి ఏమిటి..? కొనిపిచ్చిన్న వారి పరిస్థితి ఏమిటి..? ఇక్కడ వచ్చిన డబ్బులతో వేరే ప్రాజెక్టులమీద ఇన్వెస్ట్ చేస్తున్నారు..? అసలు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు..? ఏ ఏ ప్రాజెక్ట్ లు చేపడుతున్నారు..? వీరి అసలు వ్యవహారం ఏమిటి..? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’ .. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘.. వీరి బారినపడి మోసపోయిన కస్టమర్లు.. ఏజెంట్లు మరిన్ని వివరాలకోసం సంప్రదించండి : 7396560019..