Wednesday, May 15, 2024

భద్రాద్రి రామయ్య చెంత నుండే…

తప్పక చదవండి
  • 27న కమలనాధుల శంఖారావం..
  • గెలుపు గుర్రాలకి టిక్కెట్లు ఖరారు..
  • ఖమ్మం పర్యటనలోని తొలి జాబితా విడుదల..
  • ఖరారైన అమిత్ షా పర్యటన..
  • కొత్త వారి చేరికపై దృష్టిపెట్టిన అధిష్టానం..
  • హైకమాండ్ నుంచి కఠినమైన ఆదేశాలు..

ఖమ్మం : కమలం పార్టీ మరో మారు హిందుత్వ అజెండాను భుజాన వేసుకుంది. ఆ పార్టీ సెంటిమెంట్ కు తగ్గట్లుగానే భద్రాద్రి రామయ్య పాదాల దగ్గర నుంచి తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. టిఆర్ఎస్ పార్టీ పరోక్షంగా మొదటి విడత అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. మరోవైపు హస్తం పార్టీ కూడా అభ్యర్థుల లిస్ట్ ను ఖరారు చేసుకుంది. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఎవరికి వారిగా రహస్య సర్వేలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఫుల్ బిజీ అయిపోయారు. కాషాయ పార్టీ తెలంగాణ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకర్తలు, ప్రజలు ఆశించిన మేరకు కార్యక్రమాలు వరవడి పెరగడం లేదు. దీంతో హై కమాండ్ తెలంగాణ రాష్ట్రంపై సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ అమీత్ షా పర్యటన మళ్లీ వాయిదా పడకుండా గ్రాండ్ సక్సెస్ చేయాలని అధిష్టానం భావించింది. అంతేకాకుండా తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పూరించాలని నిర్ణయించింది. కాషాయ పార్టీ తన ఎజెండాను ఏమాత్రం మార్చకుండా వారి సెంటిమెంట్ గాడ్ భద్రగిరి రామయ్య పాదాల చెంతను వేదికగా మార్చుకుంది. ఈనెల 27న కేంద్ర హోం మంత్రి అమీషా పర్యటన ఖమ్మంలో జరగనుంది. సభ కంటే ముందుగా అమిత్ షా భద్రాచలం వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

కాగా బీ.ఆర్.ఎస్. తొలి విడత 70 మంది అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు సిద్ధమైంది. అమావాస్య సెంటిమెంట్ తో గులాబీ బాస్ కాస్త పోస్ట్ పోన్ చేశారు. అయితే గులాబీ అభ్యర్థుల జాబితా కాస్త లీక్ కావడంతో సంబంధిత అభ్యర్థులు నియోజవర్గాల్లో హల్చల్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. పోటాపోటీగా అభ్యర్థుల జాబితా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా జాబితాలు సిద్ధం చేస్తున్న క్రమంలో కాషాయనేతలు కూడా స్పీడ్ పెంచారు. మేము సైతం ఎన్నికల అభ్యర్థుల జాబితాకు సై అంటునే మొదటి విడతలో 35 మంది అభ్యర్థులను ఖరారు చేసేందుకు అధిష్టానం ప్రణాళిక రచించింది. గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చి ఎలాగైనా వారిని గెలిపించుకోవాలని రాష్ట్ర నేతలకు హై కమాండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
అంతేకాకుండా ఇప్పటికే అమిత్ షా టీంలు తెలంగాణలో రహస్య సర్వేలు చేస్తున్నాయి. ఒక్కరే పోటీ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటించాలని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలను సమన్వయంతో పనిచేసుకోవాలని పార్టీ హైకమాండ్ నుంచి కఠినమైన ఆదేశాలిచ్చింది. పార్టీ నుంచి ఎవరూ బయటకువెళ్లకుండా చూసుకోవాలని.. కొత్త వారి జాయినింగ్స్ పై దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు హైకమాండ్ దిశానిర్ధేశం చేసింది. తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర పార్టీకి అవసరమైన వనరులను సమకూర్చడానికి సిద్దంగా ఉన్నట్లు కేంద్ర నాయకత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇరు పార్టీలకు దీటుగా ఏ విషయంలో కూడా వెనక్కు తగ్గేది లేదని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలిస్తూ కావలసినంత జోష్ ను కూడా నింపింది. బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ ల ఇరుపార్టీలలో ఉన్న బలమైన సంతృప్తి నేతలను కాషాయ పార్టీలోకి లాక్కునేందుకు వ్యూహం రచిస్తోంది.. ఈనెల 27వ తేదీ నాటికి రాష్ట్ర నాయకత్వంతో పాటు, జాతీయ పార్టీ ప్రధాన నేతల సైతం వారి కేటాయించిన నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇక ఖమ్మం జిల్లా అమీషా పర్యటన నేపథ్యంలో కాషాయ దళం స్పీడ్ పెంచింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు