Tuesday, May 21, 2024

కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బండ్ల గణేశ్‌.. ?

తప్పక చదవండి
  • రాష్ట్రంలో జోరందుకున్న ప్రచారం..
  • అది వాస్తవం కాదని ట్వీట్ చేసిన గణేష్..
  • కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ముఖ్యం..
  • ఓ కార్యకర్తగా పనిచేస్తా : బండ్ల గణేష్..

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలయ్యింది. రేపో, మాపో.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే.. అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ఓ అడుగు ముందుకేసి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.. అయితే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని రోజుల్లో రెండూ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తులను ప్రారంభించింది. అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది.. ఈ తరుణంలో చరిష్మా గల నేతలు ఎవరున్నారు..? ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై చర్చ నడుస్తోంది. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్థిక, అంగబలం ఉన్న నేతలు ఎవరున్నారు..? అనే దానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ తరుణంలో కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రయత్నం చేస్తున్నారని.. టికెట్ కోసం అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది.. గ్రేటర్‌లో బలమైన సామాజిక వర్గం, అన్ని అవకాశాలున్న నేతలకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో.. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేసిన కూకట్‌పల్లి సీటుకు బండ్ల గణేష్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ఆదివారం క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారనే ప్రచారం నేపథ్యంలో బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేసి.. పోటీ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ‘‘ఈసారి జరిగే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాకు అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ, ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యం.. దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం.. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసి.. కూకట్‌పల్లి కాంగ్రెస్ టికెట్ పై క్లారిటీ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు