Friday, May 3, 2024

ఖమ్మం కాంగ్రెస్‌లో ముసలం..?

తప్పక చదవండి
  • జాతీయ పార్టీలో పొంగులేటి వన్‌ మ్యాన్‌ షో
  • అయన రాకతో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల్లో గుబులు
  • ఆశావహుల్లో టెన్షన్‌.. జిల్లాలో అయోమయ స్థితి
  • వన్‌ మెన్‌ షో తో గ్రూపులుగా ద్వితీయ శ్రేణి లీడర్లు

హైదరాబాద్‌ : రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అసెంబ్లీ గేటు తొక్కనీయను అంటూ శపథం చేసి, కారు పార్టీ, రెబల్‌ నేతగా ఆ పార్టీ అధిష్టానం చేత బహిష్కరించబడి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో హాట్‌ టాపిక్‌ అయ్యారు…2023 జనవరి 1న తిరుగుబాటు ప్రకటించి గత 6 నెలలుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో సుదీర్ఘ సంప్రదింపులు, సర్వేలు, అభిప్రాయాలు అన్నింటిని క్రోడీకరించి తన పంతం నెరవేర్చు కునేందుకు కాంగ్రెస్‌ పార్టీయే సరైనదని భావించి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఖమ్మంలో తెలంగాణా జన గర్జన సభను నిర్వహించిన పొంగులేటి సుదీర్ఘ ప్రయాణం తరు వాత ఎట్టకేలకు మూడు రంగుల కండువా కప్పుకున్నారు.. అయి తే ఇప్పటిదాకా బాగానే ఉన్నా పొంగులేటి ఆరంగ్రేటం ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులలో గుబులు రేపుతుంది.. కొన్నెండ్లు గా జిల్లాలో పార్టీకి అన్నీ తామై వ్యవహరించిన నేతలందరూ పొంగు లేటి శీనన్న రాకతో కాస్త ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది… అధికార బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌)తో ఎదురొడ్డి నిలిచి మరీ అటు పార్టీని, ఇటు క్యాడర్‌ను నిలుపుకున్న కాంగ్రెస్‌ నేతలు శీనన్న ఎంట్రీతో సందిగ్ధంలో పడ్డారు.. 2018 ఎన్నికలలో జిల్లాలో 10కి 7 సీట్లను గెలిపించుకుని కూడా.. కొందరు వ్యక్తు లు తమ స్వార్ధ పూరిత రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని అప్రతిష్ట పాలు చేసిన.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ వంచన చేరి ముప్పేటగా దాడి చేసిన ఎదురొడ్డి పోరాడిన ఖమ్మం కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పుడు పొంగులేటి రాకతో ఆలోచనలోపడిరది..
దీనికి కారణాలు కూడా లేకపోలేదు…
ఉమ్మడి జిల్లాలో ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపులు మాత్రం మెండుగానే ఉన్నాయి.. ఇప్పుడు ఈ గ్రూపులలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రూపు కూడా చేరిపోయింది.. జిల్లా వ్యాప్తంగా భారీగా అను చరులు, అనునాయులు ఉన్న పొంగులేటి ఖచ్చితంగా తన వర్గాన్ని ముందుంచాలనే కోరుకుంటారు. ఒక్క మధిర, భద్రా చలం తప్ప అన్ని నియోజక వర్గాలలో పొంగులేటి మానియా ఉండటంతో ఇప్పుడు పాత నాయకులందరూ సైడ్‌ అయ్యే అవకా శాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ లో కొంత అనిశ్చితి ఏర్పడిరదని తెలుస్తోంది. పొంగు లేటి అధి కార టీఆర్‌ఎస్‌లో ఉన్నా కూడా ప్రతి చోట తన వర్గాన్ని పెంచి పోషించారని, దాంతో ఆ పార్టీలో కూడా క్యాడర్‌ నలిగిపోయారనే ప్రచారం ఉంది. అంతే కాదు 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా పొంగులేటి తన వర్గం నాయకులను అభ్యర్థులుగాపెట్టి, బీఆర్‌ఎస్‌ బీఫామ్‌ అభ్యర్థులను ఓడగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి.. అం దుకోసమే శీనన్నను అధినేత కేసీఆర్‌ పక్కకు పెట్టి టికెట్‌ కూడా నిరాకరించారని పొలిటికల్‌ సర్కిళ్లలో ఇప్పటికీ ప్రచారం ఉంది.
వర్గాలను పెంచిపోషించటంలో పొంగులేటి దిట్ట..
పొంగులేటి పైకి ఎంతో సున్నితమైన మనస్కుడిగా కనిపించిన ప్పటికీ అవకాశవాద రాజకీయాలు, వర్గాలను పెంచిపోషిం చటంలో దిట్ట అనేది రాజకీయ విశ్లేషకులు నొక్కి చెబుతున్న మాట… ప్రజలలో ఎంతో ఫాలోయింగ్‌ ను క్రియేట్‌ చేసుకున్న ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌ లో ఎలా ఇమిడి పోతారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారి పోయింది. పొంగులేటి కాంగ్రెస్‌ లో చేరిక ఖరారైన నాటి నుండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రూపు రాజకీయాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.. అగ్రనేత రాహుల్‌ హాజరౌతున్న సభలోనే సీఎల్పీ నాయకుడు, మధిర శాసన సభ్యులు భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రను ముగించేలా నాయకులు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ జనగర్జన సభ పొంగులేటి నిర్వహించిందా..
తెలంగాణ జన గర్జన మొత్తం కూడా పొంగులేటి సభలాగానే మారిపోయింది.. వాస్తవానికి జిల్లా నలుమూలల నుండి రాహుల్‌ సభకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ జనసమీకరణ చేశారు… దీనికోసం కోట్లాది రూపాయలను ఆయన వెచ్చించారు కూడా.. కానీ అంతర్గత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ మహాసభను ఎవరికి వారు క్లయిమ్‌ చేసుకునే పనిలో పడ్డారు… పొం గులేటి.. తెలంగాణా జనగర్జన సభను నిర్వహించి సక్సెస్‌ అయినప్పటికీ ఆయన ఖమ్మం జిల్లాలోని నాయకులను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నాలలో మాత్రం సక్సెస్‌ కాలేకపోయారని స్పష్టంగా తెలు స్తోంది. సభ విజయవంతం అయిన తరువాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాలను సైతం కాం గ్రెస్‌ నేతలు విడివిడిగా నిర్వహించటం, గత నాలుగు రోజులుగా కూడా జిల్లా నేతలు ఎవరికి వారే ఎడమోహం పెడమోహంగా వ్యవహారాలను చక్కబెట్టడం కాంగ్రెస్‌ శ్రేణులతో గుబులు పుట్టిస్తోంది.
ఏ నాయకుని ప్రభావం లేకపోయినా ఖమ్మం కాంగ్రెస్‌దే..
ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క నాయకుని ప్రభావం పూర్తిగా లేక పోయినా సగటు కాంగ్రెస్‌ కార్యకర్త శ్రమతో జిల్లాలో ఎంతో మంచి ఫలితాలను చే జిక్కించుకున్న కాంగ్రెస్‌ ఇప్పుడు కొత్తగా వచ్చిన నేతలు, జిల్లా నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలుగా చెప్పుకుంటున్న వారితో ఇప్పుడు హస్తం పార్టీలో ఎలాంటి కల్లోలం వస్తుందోనని భయం ఎక్కువైంది… పొంగులేటి చేరికతో కాంగ్రెసుకు బలం చేకూరుతుందనే సంతోషం కంటే పైకి ఆలింగనాలూ చేసుకుని, అంతర్గతంగా మనసులు కలవని నేతల వల్ల జిల్లా కాంగ్రెస్‌ వేరు కుంపటి ఎటుపోతుందనే భయమే ఎక్కువయ్యింది … తెలంగాణ జన గర్జన సభకు చాలా చోట్ల పాత కాంగ్రెస్‌ వర్గం పూర్తి స్థాయిలో పనిచేయలేదనే చెప్తుం డగా, చాలా చోట్ల సరిjైున సమాచారం కూడా చేరవేయలేదని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నే నమ్ముకున్న నాయకులు చెప్తున్నారు… దీనంతటికీ కారణం డిసిసి లు సభ పై పెదవి విరవటమనేది కారణంగా చెప్తున్నారు…
బహిరంగ సభకు బిఆరెస్‌ అనేక అడ్డంకులు సృష్టించినా..
వాస్తవానికి బహిరంగంగా అధికార బిఆరెస్‌ సభకు అనేక అడ్డంకు సృష్టించినట్లు చెప్తున్నా, కాంగ్రెస్‌ లో ఓ వర్గం కూడా సభ ను సక్సెస్‌ కాకుండానే ఆలోచనలోనే ఉన్నట్లు కార్యకర్తలే చర్చించుకోవటం ఖమ్మం కాంగ్రెసులో రానున్న రోజులలో ఏ మార్పులు వస్తాయోననే ఆందోళన వ్యక్తం అవుతుంది.. అంతే కాక పొంగులేటి చేరికకు నిర్వహించిన బహిరంగ సభకు ముందు, తరువాత జిల్లాలో భట్టి, రేణుక వర్గం కాస్త దూకుడు పెంచారనే వార్తలు వెలువడుతున్నాయి … పొంగులేటి రాక ముందే అధికార పార్టీని మట్టుబెట్టి 7 సీట్లు గెలిచామని, అప్పటి కంటే ఇప్పుడు ఇంకా బలంగా కాంగ్రెస్‌ తయారైందని, కొత్తగా పొంగులేటి వచ్చి బాగుచేసేది ఏమి లేదని బహిరంగంగా నే నేతలు మాట్లాడుతున్నారు… దీంతో అంతా మంచి జరిగితే కాంగ్రెస్‌ బలమని, ఏదైనా అనుకోని వ్యవహారం ఫలితాలలో వస్తే పొంగులేటిపై నెట్టే ప్రయత్నం ఇప్పటినుండే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది… దీనికి శీనన్న పై బిఆరెస్‌ చేస్తున్న ఆరోపణలను కూడా ఉదాహరించి అవకాశాలు వెతుక్కుతున్నారు..
నియోజకవర్గాలలో అభ్యర్థుల ప్రకటన అసలుకే మోసమా..
పొంగులేటి ఒక్కఅడుగు ముందుకేసి పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు.. ఇప్పుడు ఆ వ్యవహారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ లో పెద్ద దుమారమే లేపేట్లు ఉంది… దీంతో కాంగ్రెస్‌ లో మొదటినుంచి పని చేస్తున్న వారికి, పొంగులేటి వర్గానికి మధ్య కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి.. గతంలో గులాబీ పార్టీలోనూ శీనన్న కొంత మంది రెబల్‌ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బిఆరెస్‌ ఓటమికి పాల్పడ్డ మచ్చలు ఉండటంతో, రానున్న రోజుల్లో కాంగ్రెసులో వర్గపోరు తారాస్థాయికి చేరే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమం లో పొంగులేటి అధిష్టానం మాట విని కలిసి పోతారా, లేక ఆయన సహజత్వం లాగే తన వర్గాన్ని రెబల్‌ లాగ తయారు చేస్తారా.. అనేడి వేచి చూడాల్సి ఉంటుంది .ఇలా కనుక జరిగితే గతంలో లేని విధంగా కాంగ్రెస్‌ మూడు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసి, రెండు టర్మ్‌ లుగా కోలుకుని గులాబీ పార్టీకి జీవం పొసే అవకాశాలు లేకపోలేదు… సో అంతా బాగుందనుకుంటున్న కాంగ్రెస్‌ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇన్‌ ఫ్రంట్‌ అఫ్‌ క్రోకడాయిల్‌ ఫెస్టివల్‌గా మారిపోయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు