- తానా సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ జోస్యం సీతక్కే మా.. సీఎం అభ్యర్థి !
- పోలవరం కట్టేదీ మేమే.. అమరావతి నిర్మించేదీ మేమే..
- ప్రజల కోసం మంచి చేసే అవకాశం ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి
- ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం లేదు..
దళితులు, ఆదివాసీలను ముఖ్యమంత్రిని కానివ్వరా? అన్న ప్రశ్నకు బదులుగా.. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.. అయితే
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి..
హైదరాబాద్ : మరోకొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల వేడి అమాంతంగా పెరిగింది. హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలనే తపనలో బీఆర్‌ఎస్ ఉవ్వర్లూరి తుండగా.. ఈ సారైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సభల్లో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి కట్టేది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. ఆ రెండిరటినీ పూర్తిచేయడమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కి ఎన్నారైలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దళితులు, ఆది వాసీలను ముఖ్యమంత్రిని కానివ్వరా? అన్న ప్రశ్నకు రేవంత్ స్పందిస్తూ.. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌లో లేదన్నారు. అవసరమైతే సీతక్కను పార్టీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితులు, గిరిజనులకు పెద్ద పీట వేస్తామని చెప్పే సందర్భంలో అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే దళితు లు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్‌ను ఎన్నారైలు కోరారు. దీనికి సమాధానంగా రేవంత్.. అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీల పక్షాన నిలుస్తుందన్నారు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులకు అనుకూలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు కావొచ్చన్నారు. పని చేసే వారికి గౌరవం కచ్చితంగా దక్కుతుందన్నారు.పదవులకోసం కాంగ్రెస్ పార్టీలో పైరవీలు చేసుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో సీతక్కకు మంచి ఎమ్మెల్యేగా పేరుంది. అన్ని పార్టీల నేతలు ఆమెను గౌరవిస్తారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీలలోనూ ఆమెకు అభిమానులున్నారు. నిరంతరం ప్రజల్లో తిరుగుతూ, ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ సీతక్క మంచి రాజకీయ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డితో సీతక్కకు మంచి అనుబంధం ఉంది. తనకు సీతక్క సొంత చెల్లి లాంటిదని రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానిం చగా.. రేవంత్‌ను తాను సొంత అన్నలా భావిస్తానని అనేకసార్లు సీతక్క చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కకు కీలక పదవి ఇస్తామని రేవంత్ గతంలో బాహటంగానే వెల్లడిరచారు. అంతేకాకుండా జాతీయ స్థాయి కాంగ్రెస్‌లో సీతక్క కీలక పోస్టు లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ఫోకస్ చేయడం వెనుక వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. సీతక్కకు ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించు కునేందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది.ుఖ్యమంత్రిని చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.. అయితే ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి..