Monday, November 4, 2024
spot_img

మోడీ టీంలో మార్పులు

తప్పక చదవండి
  • ఫ్రాన్స్‌ పర్యటనకు ముందే మంత్రి వర్గ విస్తరణ..?
  • దాదాపు 22 మంది సీనియర్లకు ఉద్వాసన..?
  • ఈ నెల 18న ఎన్డీఏ సమావేశం
  • ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సీనియర్ల సేవలు!
  • షిండే, అజిత్‌ పవార్‌ వర్గానికి కేబినెట్లో చోటు..?
  • తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికీ ఛాన్స్‌..!
  • ఢిల్లీలో చకచకా మారుతున్న పరిణామాలు !

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌ పర్యటనకు ముందు కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చునని జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని జూలై 14 నుండి 16 మధ్య ఫ్రాన్స్‌ లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో గత వారం నుండి దేశ వ్యాప్తంగా కేంద్ర కాబినెట్‌ లో కీలక మార్పులు జరుగుతాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సమయం దగ్గర పడిరదని.. ఒకటి రెండు రోజుల్లో ముహుర్తం ఉండబోతోందని చెబుతున్నారు. ప్రధాని మోడీ మొదటి టర్మ్‌ మూడుసార్లు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ప్రస్తుత రెండో టర్మ్‌ ఇప్పటికే రెండుసార్లు మార్పులు చేర్పులు చేయగా, ఇది మూడోసారి అవుతుంది. ఈసారి ఏకంగా దాదాపు 22 మంది కొత్తవారికి కేబినెట్లో చోటు దక్కవచ్చునని భావిస్తున్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో కీలక అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఏడాది లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ఏ వర్గాల్లోను అసంతృప్తి లేకుండా ఈసారి కేబినెట్‌ విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఇక ఇటీవల కిషన్‌ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మార్చడం వలన ఆయనను ఎవరితో భర్తీ చేస్తారు ? తెలుగు రాష్ట్రాల నుండి ఎవరిని తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.ంండు రోజుల క్రితం డిల్లీ వేదికగా కెబినెట్‌ మీటింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌ లో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ బాధ్యతలను అప్పగించిన నాయకుల విషయంలో కీలక మార్పులు గురించి చర్చ జరిగింది. మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగబోతున్నాయనే ఊహాగానాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఈ వారంలోనే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించ బోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇటీవల కొందరు మంత్రులతో సమావేశాలు జరిపిన సంగతి తెలిసిందే. నడ్డాతో నిర్మల కూడా సమావేశమయ్యారు. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ కూడా సమాయత్తమవుతోంది. పాత మిత్రులను దగ్గరకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్డీయే నుంచి విడిపోయిన పార్టీలను కూడా ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ఈ నెల 18న ఎన్డీయే సమావేశానికి హాజరుకావాలని వివిధ పార్టీలను ఆహ్వానించింది. మోడీ ఈ నెల 13, 14 తేదీల్లో ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. పారిస్‌లో ఈ నెల 14న జరిగే బాస్టిల్లే డే పెరేడ్‌లో గౌరవ అతిథిగా పాల్గొంటారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు