Tuesday, June 25, 2024

మజ్లిస్ పార్టీ చేతిలోనే కేసీఆర్ కీలుబొమ్మ..

తప్పక చదవండి
  • నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దుర్మార్గ పాలన సాగుతోంది..
  • రైతుల భూములతో వ్యాపారం చేయడానికే 220 జీవో తెచ్చారు..
  • ధరణితో నష్టపోయిన రైతుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే..
  • ఈనెల 27న ఖమ్మంలో రైతు భరోసా సభ భారీగా నిర్వహిస్తాం..
  • కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

హైదరాబాద్ :
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీ చేతిలోనే కేసీఆర్ కీలుబొమ్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దుర్మార్గ పాలన సాగుతోంది. మంత్రి తన కుటుంబ సభ్యులు బంధువుల పేరిట భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. రైతుల భూములతో వ్యాపారం చేయడానికే ఈ 220 జీవో తీసుకువచ్చారు. ఏ అధికారులు ఈ 220 జీవో ఇచ్చారో వారితోనే ఈ జీవోను రద్దు చేయించే బాధ్యత ప్రభుత్వానిదే. ఎక్కడ చూసినా ధరణి పేరుతో ఈ ప్రభుత్వం పేద రైతుల భూములను లాక్కుంది. ధరణిలో నష్టపోయిన రైతు ఆత్మహత్యలన్నీ.. ప్రభుత్వ హత్యలే. నిర్మల్‌లో 260 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఏ హక్కుతో మంత్రి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఖమ్మంలో 27వ తేదీన రైతు భరోసా బీజేపీ బహిరంగ సభను నిర్వహిస్తాం. ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరవుతారు.” అని కిషన్ రెడ్డి అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు