Friday, May 3, 2024

అమెరికాలో అమానుషం..

తప్పక చదవండి
  • భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి..
  • కాల్పుల గాయాలతో మరణించినట్లు గుర్తింపు..
  • దర్యాప్తు చేపట్టిన అమెరికన్‌ పోలీసులు..

న్యూయార్క్‌ :
ఆరేళ్ల కుమారుడితో పాటు భారతీయ దంపతులు అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన అమెరికాలోని మేరీల్యాండ్‌లో వెలుగుచూసింది. దీనిని డబుల్‌ మర్డర్‌`సూసైడ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. మేరీల్యాండ్‌ బాల్టిమోర్‌ కౌంటీలోని తమ నివాసంలో భార్యాభర్తలు, వారి కుమారుడు ఒంటిపై తుపాకీ గాయాలతో విగతజీవులుగా పడి ఉన్నట్టు పోలీసులు వెల్లడిరచారు. వీరిని యోగేశ్‌ హెచ్‌ నాగరాజప్ప (37), ప్రతిభ వై అమర్‌నాథ్‌ (37), యశ్‌ హోనాల్‌ (6)గా గుర్తించినట్టు బాల్టిమోర్‌ కౌంటీ పోలీస్‌ అధికార ప్రతినిధి ఆంథోనీ షెల్టాన్‌ తెలిపారు. ఈ ఘటనను డబుల్‌ మర్డర్‌ సూసైడ్‌గా భావిస్తున్నామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని వివరించారు. ప్రతి ఒక్కరి శరీరంపై తుపాకి గాయాలున్నట్టు చెప్పారు. ఇక, మంగళవారం సాయంత్రం ఈ కుటుంబాన్ని చివరిసారిగా చూసినట్టు స్థానికులు తెలిపారని, మరణానికి దారితీసిన కారణాలు, తీరును గుర్తించేందుకు శవపరీక్షలను నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. తన కుమారుడు, భార్యను తుపాకీతో కాల్చి యోగేశ్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన చర్యతో ప్రాణాలు పోగొట్టుకోవడం హృదయవిదారకం.. ఇది చాలా బాధించింది… బాధిత కుటుంబం, భారతీయ కమ్యూనిటీకి మేము అన్ని విధాలుగా సహాయం చేస్తాం.. అని బాల్టిమోర్‌ కౌంటీ ఎగ్జిక్యూటివ్‌ జానీ ఓల్సీజ్విస్కీ చెప్పారు. అయితే, ఈ ఘటన కారణంగా చుట్టుపక్కల ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు పేర్కొన్నారు. కర్ణాటకలోని, దేవెనగెరి జిల్లా, జాగలూర్‌ తాలూకా, హ్లలెకల్లు గ్రామానికి చెందిన యోగేశ్‌ కుటుంబం గత తొమ్మిదేళ్లుగా మేరీల్యాండ్‌లో నివసిస్తోంది. యోగేశ్‌ తల్లి శోభ మాట్లాడుతూ.. తన కుమారుడికి 9 ఏళ్ల కిందట వివాహం జరిగిందని, అప్పటి నుంచి కొడుకు, కోడలు అక్కడే ఉంటున్నారని చెప్పారు. అమెరికాలోని వేరే ప్రాంతంలో ఉన్న తన చిన్న కుమారుడికి పోలీసులు ఫోన్‌ చేసిన ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు.. ఆ తర్వాత వాడు మాకు ఫోన్‌ చేసి చెప్పాడు.. కానీ, కారణం ఏంటో మాకు తెలియదు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఎలా ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు.. కొడుకు, కోడలు, మనవడు చనిపోయాడని మాత్రమే తెలిసింది… వాళ్లను ఎవరైనా చంపేశారా? లేక వాళ్లే ఆత్మహత్య చేసుకున్నారా? ఏం జరిగిందో సమాచారం లేదు.. అని యోగేశ్‌ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వారి మృతదేహాలను భారత్‌కు రప్పించే ఏర్పాట్లు చేయాలని కేంద్రం, కర్ణాటక ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్ధించారు. ఘటన జరిగిన మూడు రోజులైనా తాము ఇంత వరకూ మృతదేహాలను చూడలేదని వాపోయారు. కొద్ది రోజుల కిందట తనకు ఫోన్‌ చేసి.. అంతా బాగానే ఉందని యోగేశ్‌ చెప్పాడని ఆమె తెలిపారు. ఏదైనా సమస్య ఉందా? అనేది తనకు అస్సలు తెలియదని యోగేశ్‌ తల్లి రోదించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు