Monday, May 6, 2024

జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ..

తప్పక చదవండి
  • సర్క్యులర్ జారీ చేసిన హైదరాబాద్​ డీఈఓ..
  • హర్షం వ్యక్తం చేసిన హెచ్.యూ.జే..

హైదరాబాద్ : హైదరాబాద్​ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆర్​.రోహిణి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ ఎడ్యకేషనల్​ ఆఫీసర్స్​, డిప్యూటీ ఇన్​స్పెక్టర్స్​ ఆఫ్​ స్కూల్స్​, ప్రైవేట్​ స్కూళ్లకు సర్య్కులర్​ జారీ చేశారు. 2023–24 అకడమిక్​ ఇయర్​కు సంబంధించి హైదరాబాద్​ స్కూళ్లలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూళ్ల ఫీజులో రాయితీ కోరుతూ ఇటీవల హైదరాబాద్​ జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూజే –టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధి బృందం డీఈఓకు వినతి పత్రం అందించింది. దీనికి డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ.. సర్క్యూలర్ జారీ చేశారు. ఫీజు రాయితీపై డీఈఓ ఆదేశాలపై హెచ్​ యూజే అధ్యక్ష, కార్యదర్శులు బి. అరుణ్​ కుమార్​, జగదీష్​ , వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్ రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు