Thursday, May 2, 2024

అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు..

తప్పక చదవండి
  • రైతులను నిలువునా దోచుకుంటున్న వైనం
  • తరుగు పేరుతో ధాన్యంలో కోత.
  • రైతుల నుండి అధిక వసూలు.
  • తమను కలెక్టర్‌ ఆదుకోవాలని రైతులు వేడుకోలు.

ఆత్మకూర్‌ : మండలంలోని పెంచికలపేట పిఎ సిఎస్‌ సొసైటీ పరిధిలో వరి ధాన్యం విక్రయాల్లో తమను అన్ని విధాల దోపిడికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా వరి ధాన్యం అమ్ముకునేందుకు (నీరుకుళ్ళ) క్రాస్‌ చలివాగు వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యాన్ని తరలించి నాన్న ఇబ్బందులు పడుతున్నారు. తూకంలో బస్తా ఒక్కింటికి రెండు కేజీలు కోత విధిస్తున్నారు. ఒక క్వింటాకు 5 కేజీల చొప్పున తరువు తీస్తున్నారు అని రైతులు అంటున్నారు. ఇది పోను మిల్లర్లు వద్ద కు వెళ్లిన ధాన్యాన్ని తూకం సక్రమంగా లేదని, ధాన్యం నాణ్యత లోపంమని మ్యాచర్‌ రావడం లేదని నాన కుంటి సాకులు చెప్పి రైతుల ధాన్యంలో భారీగా కోతలు విధిస్తున్నారు. మిల్లర్లు, పిఎ సిఎస్‌ సొసైటీ సిబ్బంది కుమ్మక్కై ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇదేమని అడిగిన రైతుల పట్ల కక్ష సాధింపుతో వారి ధాన్యం తూకం వేయకుండా లారీలో తరలించకుండా కాలయాపన చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వరి ధాన్యం తరలించేందుకు హమాలీలను సక్రమంగా ఏర్పాటు చేయకుండా ఉన్న కొద్ది మందితో పనిచేస్తూ ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా లారీల రవాణా కు వెయిటింగ్‌ చార్జి ల పేరుతో ఒక్కో బస్తకు పది రూపాయలు, చొప్పున రైతుల వద్ద అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇవి కాకుండా ఒక్కో రైతు నుండి అదనంగా 500 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రాజకీయ పలుకుబడి కలిగిన రైతులు, బడా రైతుల వద్ద నుండి నేరుగా కల్లాల వద్దకే వెళ్లి కాంటాలు వేసుకుని లారీలను పంపించి ట్రక్‌ షీట్‌ ఇస్తూ మిల్లర్లకు తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చాటు మాటుకు డబ్బులు ముట్ట చెప్పిన వారి ధాన్యం క్షణాల్లో మిల్లర్లకు తరలిస్తున్నారు. ఇదేం తీరని అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇంత తతంగం కొనసాగుతున్న సొసైటీ చైర్మన్‌, గాని సంబంధిత అధికారులు గానీ పట్టించుకోవడంలేదని ఇదంతా వారి కనుసన్నలోనే నడుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ధాన్యం మిల్లర్లకు తరలించేందుకు పోలీసులు లారీలను పంపినప్పటికీ ధాన్యం తూకం వేయకపోవడంతో సిబ్బంది హమాలి లేకపోవడంతో లారీలు తిరిగి వెళ్ళి పోతున్నాయి. పిఎ సిఎస్‌ సిబ్బంది నిర్వహణ వల్లే ఇలా జరుగుతోందని రైతులు అంటున్నారు, హమాలి డబ్బులు ప్రభుత్వం నుండి తిరిగి వచ్చిన రైతులకు చెల్లించడం లేదు. మంగళవారం కొనుగోలు కేంద్ర వద్దకు పరిశీలనకు వచ్చిన నోడల్‌అధికారి విజయ భాస్కర్‌ రెడ్డి, డిటి సివిల్‌ సప్లై అధికారి సత్యనారాయణ కి రైతులు తమ గోడు వెళ్ళ బోసుకున్న పిఎ సిఎస్‌ సిబ్బందిని మందలించాల్సింది పోయి వారికి వత్తాసు పలుకుతూ రైతులు నష్టపోతే పోనీ అని నిర్లక్ష్యంగా మాట్లాడాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. వర్షాకాలం సమీపించడంతో తమ ధాన్యం ఎప్పుడు తరలి పోతుందో అని ఇంత కష్టపడి పండిరచిన ధాన్యం చేతికి అందకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి వెంటనే వరి ధాన్యం తరలించేందుకు చర్యలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

రైతులకు అండగా సీఐ :
రైతుల ధాన్యం విక్రయాల బాధలను చూసి ఆత్మకూరు సిఐ బండారి కుమార్‌ చెలించి ప్రత్యేక చొరవతో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను ఆపి యాజమాన్యంతో మాట్లాడి రైతుల ధాన్యాన్ని మిల్లర్లకు తరలించేందుకు ప్రత్యేక చొరవ చూపడం పట్ల రైతులు సిఐని అభినందిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు