Saturday, May 4, 2024

అంగరంగ వైభవంగా, మహోన్నతంగా మైసమ్మ, పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

తప్పక చదవండి
  • జూన్ 3 వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు భక్తి శ్రద్దలతో కార్యక్రమాలు..
  • 5 వతేదీ సోమవారం ఉదయం 7-52 నిమిషాలకు మూలా నక్షత్రంలో వైభవోపేతంగా ముగిసిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట..
  • రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, గౌలిదొడ్డిలో భక్తి శ్రద్దలతో కార్యక్రమ నిర్వహణ..
  • వేలాదిగా తరలివచ్చిన భక్తాదులు, స్థానిక ప్రముఖులు..
  • అమ్మవారి నామ స్మరణతో, మంత్రోచ్ఛరణలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం..

గండిపేట : రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, గౌలిదొడ్డి గ్రామంలో భక్తి పారవశ్యం ఓలలాడింది.. శ్రీ శ్రీ శ్రీ మైసమ్మ, పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం భక్తి శ్రద్దలతో, అంగరంగ వైభవోపేతంగా జరిగింది.. అశేష భక్తజనంతో పాటు స్థానిక ప్రముఖులు హాజరు కాగా.. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది.. ఈ వేడుక జూన్ 3 వతేదీ నుంచి మొదలై జూన్ 5 నాడు పరిసమాప్తి అయ్యింది..

3-6-2023 శనివారం నాడు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12-30 వరకు గంగా నయనము, గోపూజ, గణపతి పూజ, స్వస్తివాచనం, మాతృకపూజా రక్షాబంధనం, ఆచార్యాది ఋత్వి గ్వరణము, పంచగవ్య ప్రాశన, యాగశాల ప్రవేశము, ప్రధాన కలశ స్థాపన, సర్వథా భద్ర మండల కలశ స్థాపన, అఖండ దీప ప్రతిష్ట, వాస్తుమండలాధారణ, ఆదిత్యాది నవగ్రహారాధన, దేవీ సప్తశది పారాయణము, యంత్రములు అభిషేకం, మూలమంత్ర జపం, మంగళ హారతి, తీర్ధ ప్రసాద వినియోగము జరిగింది.. సాయంత్రం 5-30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మృత్సఙ్గ్రహణము, ఆకురార్పణము, ప్రధాన దేవతా ఆహ్వానము, అగ్ని ప్రతిష్ట, దీక్షా హోమము, మూల మంత్ర అనుష్టానములు, జాలాది వాసము, క్షీరాది వాసము, యంత్రములకు సహస్రనామార్చన, మంగళహారతి, స్వస్తి, తీర్ధ ప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది..

- Advertisement -

4-6-2023 ఆదివారం నాడు ఉదయం 8 గంటనుండి మధ్యాహ్నం 12-30 వరకు ప్రాతః కాల పూజ, గ్రామోత్సవం, యంత్రములు అభిషేక పారాయణం, గణపతి హోమం, రుద్రాహవనం, అరిత్వాదినవగ్రహ హవనం, వాస్తువాహనం, అదాహిత సహిత చండీ వాహనం, గ్రామ బలిహరణ, మంగళ హారతి, తీర్ధ ప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిగాయి.. సాయంత్రం 5-30 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు విగ్రహ స్పర్శనము, క్షీరాభిషేకం, ధాన్యాధివాసం, శయ్యాదివాసం, పుష్పాధి వాసం, ఆదివాసి హవనములు, భస్మ గంధ సుగంధ ద్రవ్యాభిషేకములు, సామూహిక కుంకుమార్చన, ప్రతిమాన్యాస హవనం, మంగళ హారతి, తీర్ధ, ప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిగాయి..

5-6-2923 సోమవారం నాడు ఉదయం 5 గంటలకు ప్రాతః కాల పూజ, ప్రతిష్టా హవనం, శాంతి పౌష్టిక హవనం, గర్త పూజ, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం, ధ్వజ ప్రతిష్ట, బింబ కళాన్యాసము, పూర్ణాహుతి, ప్రతిష్టా కార్యక్రమం అన్నీ జరిపిన తర్వాత అన్న దానమునకు ముందు బృహత్సాహం, మహాదాశీర్వచనం, ఆచార్యాది బ్రహ్మ, వరుణ, సన్మానములు అణిర్వచన కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు..

ఈ అపురూప కార్యక్రమం చైర్మన్ రేఖా యాదగిరి ఆధ్వర్యంలో జరిగాయి.. మూడురోజులపాటు జరిగిన ఈ మహోత్సవంలో మాజీ సర్పంచ్ గొల్ల స్వరూపా నగేష్ యాదవ్, భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దార్గుపల్లి ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు, వట్టి నాగులపల్లి మాజీ ఎంపీటీసీ గొల్ల నాగేష్ యాదవ్, వట్టి నాగుల పల్లి మాజీ ఉప సర్పంచ్ లు భక్తి శ్రద్దలతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడంలో తమవంతు పాత్రను పోషించారు.. గుడిని సందర్శించిన వారిలో ఎమ్మార్వో రాజశేఖర్, ఆర్.ఐ. మహిపాల్ రెడ్డి తదితర పెద్దలు పాల్గొని దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు