Monday, April 29, 2024

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..

తప్పక చదవండి
  • ట్రేడ్/టెక్నీకల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ గుజరాత్.. రిఫైనరీస్ డివిజన్ పరిధిలో 1720 ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపికైన వారు మధుర, పానిపట్ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్, గువాహటి, బరౌని, గుజరాత్, హల్దియా.. రిఫైనరీల్లో పనిచేయవల్సి ఉంటుంది. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా అక్టోబర్‌ 31, 2023వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌/విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, మెకానికల్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీలున్నాయి. టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌/విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో నవంబర్ 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ : అక్టోబర్ 21, 2023.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 20, 2023.. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: నవంబర్ 2, 2023 నుంచి 27 వరకు.. రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 3, 2023.. రాత పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: డిసెంబర్‌ 8, 2023
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు: డిసెంబర్‌ 13 నుంచి 21, 2023 వరకు.. ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 869.. టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు : 851..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు