Wednesday, May 1, 2024

ఉప్పల్‌లో భారత్‌ చెత్త రికార్డు..

తప్పక చదవండి
  • హైదరాబాద్‌లో టీమిండియాకు తొలి ఓటమి..

ఐదేండ్ల తర్వాత హైదరాబాద్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడిన భారత జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్డేడియం వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమి ద్వారా భారత్‌.. భాగ్య నగరంలో తొలిసారిగా టెస్టుమ్యాచ్‌లో పరాజయం పాలైనచెత్త రికార్డును దక్కించుకోవాల్సి వచ్చింది. 14 ఏండ్లలో ఉప్పల్‌లో భారత్‌ టెస్టు మ్యాచ్‌ ఓడటం ఇదే తొలిసారి. 2005లో తొలిసారి (వన్డేలకు) అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన ఉప్పల్‌ స్టేడియంలో మొదటి టెస్టు 2010లో జరిగింది. ఇంగ్లండ్‌తో ముగిసిన మ్యాచ్‌తో కలిపి ఇక్కడ ఆరు టెస్టులు జరిగాయి. ఇందులో భారత్‌ ఏకంగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి ఒక్క మ్యాచ్‌ డ్రా చేసుకుంది. కానీ తాజాగా ఇంగ్లీష్‌ జట్టుతో ఓడిరది.
ఉప్పల్‌ టెస్టు సూపర్‌ హిట్టు.. లక్ష మందికి పైగా హాజరు..
నాలుగు గంటలలో ముగిసిపోయే టీ20ల మోజులో ఇతర ఫార్మాట్ల మనుగడే ప్రశ్నార్థకమువుతున్న వేళ భాగ్యనగరం టెస్టు క్రికెట్‌కు సరికొత్త ఊపిరులూదింది. క్రికెట్‌లో అసలైన మజాను ఇచ్చే టెస్టు లను చూసేందుకు తాము ఎందుకు రామని, ఆటను ప్రోత్సహించకుండా ఎలా ఉంటామని హైదరా బాద్‌ వాసులు ఘనంగా చాటిచెప్పారు. ఐదేండ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌ జరుగుతున్నా భారత స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ ఆడకున్నా ఉప్పల్‌లో నాలుగు రోజులుగా అభిమానులు పోటెత్తారు. నాలుగు రోజులలో మొత్తంగా లక్షకు మందికి పైగా ఈ మ్యాచ్‌ను స్టేడియం నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ మధ్యకాలంలో భారత్‌ స్వదేశంలో ఆడిన టెస్టులకు ఇంతమంది హాజరవడం బహుశా ఇదే ప్రథమం. 2018 తర్వాత టెస్టులకు ఉప్పల్‌ స్టేడియం తొలిసారి ఆతిథ్యమిచ్చింది. వన్డే వరల్డ్‌ కప్‌లో పునర్నిర్మాణ పనులు చేపట్టాక పూర్తిగా కొత్త లుక్‌లో ఉన్న ఉప్పల్‌లో కొత్తగా ఎన్నికైన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రేక్షకులకు అన్ని వసతులను సమకూర్చి వాళ్లు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తపడిరది. బీసీసీఐ లెక్కల ప్రకారం.. భారత్‌ ` ఇంగ్లండ్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ను చూడటానికి తొలి రోజు (జనవరి 25న) 23వేల మందికి పైగా జనం వచ్చారు. రెండో రోజు 32 వేలకు పైగా మంది స్టేడియానికి హాజరుకాగా మూడో రోజు 25,561 మంది మ్యాచ్‌ను తిలకించారు. ఆట కీలక మలుపులు తిరిగిన నాలుగో రోజు కూడా సుమారు 28 వేల మంది హాజరయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు