Saturday, May 4, 2024

వ‌ర్జీనియా నుంచి ఆ రాష్ట్ర సేనేట్‌కు భార‌తీయ ఘ‌జాలా హ‌ష్మి…

తప్పక చదవండి

వాషింగ్ట‌న్‌ : అమెరికా వ‌ర్జీనియా రాష్ట్రంలో.. భార‌తీయ మూలాలు ఉన్న ఘ‌జాలా హ‌ష్మి సేనేట‌ర్‌గా గెలిచారు. వ‌ర్జీనియా డిస్ట్రిక్ట్ 15 నుంచి ఆమె విజ‌యం సాధించారు. హైద‌రాబాద్‌లో పుట్టిన ఘ‌జాలా హ‌ష్మి సేనేట‌ర్‌గా నెగ్గ‌డం ఇది మూడ‌వ‌సారి కావ‌డం విశేషం. ఈసారి అమెరికాలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో మొత్తం 10 మంది ఇండియ‌న్‌-అమెరిక‌న్లు ఉన్నారు. ఎక్కువ శాతం మంది విజ‌యం సాధించిన వారిలో డెమోక్రాట్లే ఉన్నారు. వ‌ర్జీనియా రాష్ట్రానికి సేనేట‌ర్‌గా ఎన్నికైన తొలి ఇండో-అమెరిక‌న్ ముస్లింగా ఆమె నిలిచారు.
వ‌ర్జీనియా స్టేట్ సేనేట్‌కు సుహ‌స్ సుబ్ర‌మ‌ణ్యం కూడా మ‌రోసారి ఎన్నిక‌య్యారు. హౌజ్ ఆఫ్ డెలిగేట్స్‌కు గ‌తంలో రెండుసార్లు ఎన్నియ్యారు. మాజీ అధ్య‌క్షుడు ఒబామా ప్ర‌భుత్వంలో టెక్నాల‌జీ పాల‌సీ అడ్వైజ‌ర్‌గా ఉన్నారు. హూస్ట‌న్‌లో పుట్టిన సుబ్ర‌మ‌ణియ‌న్‌.. వ‌ర్జీనియా హౌజ్‌కు ఎన్నికైన తొలి హిందువు కావ‌డం విశేషం. వ్యాపార‌వేత్త క‌న్న‌న్ శ్రీనివాస్ కూడా వ‌ర్జీనియా హౌజ్ ఆఫ్ డెలిగేట్స్‌కు ఎన్నిక‌య్యారు. లౌడ‌న్ కౌంటీ ఏరియా నుంచి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించారు. వ‌ర్జీనియాలో గెలిచిన ముగ్గురు భార‌తీయులు డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థులే.
ఇక న్యూజెర్సీలోని విన్ గోపాల్‌, రాజ్ ముఖ‌ర్జీలు డెమోక్ర‌టిక్ పార్టీ నుంచి రాష్ట్ర సేనేట్‌కు ఎన్నిక‌య్యారు. న్యూజెర్సీ బ‌ర్లింగ్ట‌న్ కౌంటీ నుంచి టీచ‌ర్ బ‌ల్వీర్ సింగ్ ఎన్నిక‌య్యారు. పెన్సిల్వేనియాలోని మాంట్‌గోమోరి కౌంటీ క‌మీష‌న‌ర్‌గా నీల్ మ‌ఖిజా, ఇండియానాలోని కార్మెల్ సిటీ కౌన్సిల్‌కు డాక్ట‌ర్ అనితా జోషి ఎన్నియ్యారు. ఒహియా నుంచి ప్రియా తమిల‌ర‌స‌న్‌, క‌నెక్టిక‌ట్ నుంచి అరుణ‌న్ అరుల‌పాలం గెలుపొందారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు