Tuesday, May 14, 2024

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

తప్పక చదవండి
  • అరికట్టడంలో విఫలం అవుతున్న అధికారులు..
  • రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం..
  • మూడు పువ్వులు, ఆరు కాయలుగా జోరుగా సాగుతున్న వ్యాపారం..

పరిగి : అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఇసుక మాఫియాదారులు పాత ధ్రువపత్రాలను చూపిస్తూ.. రోజుకు పదుల సంఖ్యలో ఇసుక రవాణా.. మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ దందాను కొనసాగిస్తు న్నారు.

అధికారులు దీనిని అరికట్టడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని ఆరోపణలు జోరుగా వినప డుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా, దోమ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి బుద్లాపూర్‌ మధ్యన రోడ్డు మీద లారీ నిలిపి లారీలోంచి ఇసుకను అన్లోడిరగ్‌ చేస్తుండగా వారిని వివరణ అడగగా పాత ధ్రువ పత్రాలను చూపించారు ఇసుక మాఫియా సభ్యులు.. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..చూస్తాంలే అంటూ తప్పించుకుంటూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు