Saturday, July 27, 2024

కులవృత్తుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది :- మంత్రి మల్లారెడ్డి

తప్పక చదవండి

మేడ్చల్‌ : మంత్రి మల్లారెడ్డిని కలిసిన గుండ్ల పోచంపల్లి రజకులు. దోబీఘాట్‌ నిర్మాణానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేత. దోబీఘాట్‌ కోసం స్థలం కేటాయించి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి.కులవృత్తుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందాని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చమకూర మల్లారెడ్డి అన్నారు.గురువారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన రజకులు మంత్రి మల్లారెడ్డిని కలిసి దోబీఘాట్‌ కోసం స్థలాన్ని కేటాయించాలని వినతిపత్రాన్ని అందజేశారు.దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి మల్లారెడ్డి అధికారులతో మాట్లాడి దోబీఘాట్‌ కోసం స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు చేయుతను అందించేందుకు అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రజకులకు,నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌,బిసి బంధు పథకం ద్వారా వారి వ్యాపార అభివృద్ధికి ఆర్థిక చేయూత అందజేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ మద్దుల శ్రీనివాస్‌ రెడ్డి,కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్‌,అమరం జైపాల్‌ రెడ్డి,అమరం హేమంత్‌ రెడ్డి,భేరి బాలరాజు,చింత పెంటయ్య,బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు శివలింగల సురేందర్‌ గౌడ్‌,రజక సంఘం నాయకులు మలిగే అశోక్‌,మలిగే నాగేష్‌,మలిగే శ్రీకాంత్‌,బాబుగారి శంకర్‌,మలిగే శివమణి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు