Friday, May 17, 2024

తొక్కినార తీస్తా.. జైలుకు పంపిస్తా..

తప్పక చదవండి
  • చేతక్‌ బండిపై తిరిగిన జగదీశ్‌ రెడ్డికి వేలకోట్ల ఎక్కడివి.?
  • తన ఆస్తులఫై చర్చకు సిద్ధం.. మంత్రి ఆస్తులపై చర్చకు సిద్ధమా ?
  • ఒక రోజే తనపై 70 కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉంది.
  • సంచలన వ్యాఖ్యలు చేసిన వట్టె జానయ్య యాదవ్‌.
  • ఎవరైనా రౌడీయిజం, గుండాయిజం చేస్తే తొక్కినార తీస్తా..: మంత్రి
  • భూములు ఆక్రమించి,ప్రజలను ఇబ్బంది పెట్టినా వాళ్ళు నా వెంట ఉన్నవాళ్ళయిన సరే సహించేదిలేదు జైలుకు పంపిస్తా..
  • కుట్టు మిషన్ల కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి వార్నింగ్‌
    సూర్యాపేట : సూర్యాపేట బిఆర్‌ఎస్‌ పార్టీలో మరోసారి వర్గ పోరు భగ్గుమంది. గత కొంతకాలంగా మంత్రి జగదీష్‌ రెడ్డికి, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్య యాదవ్‌ అంటి ముట్టనట్టు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.. అయితే మంత్రి జగదీష్‌ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలు, అక్రమ కేసులపై వట్టె జానయ్య యాదవ్‌ మంత్రి మీద పలు తీవ్ర సంచలన ఆరోపనలు చేసిన వీడియో జిల్లా లో హాట్‌ టాపిక్‌ గా మారింది.
    నాపై కేసులు మోపడం హాస్యాస్పదం -వట్టె జానయ్య యాదవ్‌.. నేను గత ఏడూ,ఎనమిది సంవత్సరాలుగా మంత్రి జగదీశ్‌ రెడ్డి తో రాజకీయ ప్రయాణం చేస్తూన్న, ఒకటే రోజు 60, 70 కేసులు నామీద బాణాయించడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది . అయినా నేను స్వాగతిస్తా ఉన్న, సూర్యాపేట నియోజకవర్గంలో జరుగుతున్న పొరపాట్లను ఎత్తిచూపుతున్నందుకు గౌరవ మంత్రి నన్ను జైలు పాలు చేసి, నన్ను అనగదొక్కి, ఆయన రాజకీయం లబ్ధి పొందాలని చూస్తున్నారు. నేను ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వాదాన్ని ఎత్తడమే పాపంగా భావించి, ఆ వాదనే ఖతం చేసే క్రమంలో నాపై ఈ విధంగా దాడి చేస్తున్నారు. నేను నిజంగా తప్పులు చేస్తే ఉంటె జ్యూడిషల్‌ ఉంది.నాపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని తీసుకువచ్చి ఇవాళ నా మీద ఎస్పీ కార్యాలయంలో కంప్లైంట్‌ ఇప్పించి, గతంలో ఆయన వల్లనే నాకు ప్రాణహాని ఉందని పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఇప్పించిన మంత్రి, ఇవాళ నేనేదో, నా తెలివి మీద నేను ముందుకు పోతా ఉన్నానని, కక్షతో నన్ను అనగ దొక్కడం కోసం ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎస్పి దగ్గర కంప్లైంట్‌ ఇయ్యడం అనేది ప్రజలు గమనించాలి.
    మంత్రి జగదీష్‌ రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పాలి..
    సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు మళ్లీ మళ్లీ చెప్తూన్న వట్టె జానయ్య అనే వాదాన్ని అణిచివేయాలని కుట్రతో ఒకేరోజు 70 కేసులు పెట్టి, పీడీ యాక్ట్‌ లు పెట్టాలనే కుట్ర పొందుతున్న మంత్రి జగదీష్‌ రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నాపై ఉన్న ఆరోపణలను నిరూపించేందుకు ఎక్కడికి రమ్మన్నా కూడా వస్త. నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాన్ని కాపాడు కునేందుకు ఎంతవరకైనా పోతా.ఈ హత్య రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులను ముందల పెట్టుకొని, మంత్రి స్థాయిలో నా గురించి మాట్లాడడం దుర్మార్గం. సూర్యాపేట జిల్లా ప్రజలు దీన్ని గమనించాలన్నారు.
    సూర్యాపేటకు ఎమ్మెల్యే కాకముందు జగదీష్‌ రెడ్డి బతికేంది.?..
    తుంగతుర్తి నియోజకవర్గంలో కనీసం ఆయన వార్డు మెంబర్‌ గా కూడా గెలవలేదని, సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చాక రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని, మంత్రి అయ్యాక ఇక్కడ ఎవడు సంతోషంగా బతకకూడదని, అందరిని తొక్కి పడేసి, నాలాంటోడు ఎవడన్నా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడితే, నాలాంటి వాళ్ళును తొక్కడం కోసమే మంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజుల్లో మంత్రి జగదీశ్‌ రెడ్డి రూ. 100 లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంటే, ఇవాళ వేలకోట్లు ఎలా సంపాదించాడని, ఈయన బతుకు ఏంటో మనకు తెలీదా అన్నారు. ఒకప్పుడు చేతక్‌ బండి వేసుకుని తిరిగినటువంటి వ్యక్తి, ఇవాళ వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు.? అవి ఎక్కడినుంచి వచ్చినాయని ప్రశ్నించాడు. నేను ఏం చేసినా.? ఆయన ఏం చేశాడు.? నాకు ఎక్కడి నుండి వచ్చాయో, ఆయానకి ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకోవడానికి ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. నిన్ను ఏది ఏమైనా వదిలిపెట్టేది లేదని, దయచేసి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందన్నారు.
    మంత్రి జగదీష్‌ రెడ్డి వార్నింగ్‌..
    ఎవరైనా రౌడీయిజం గుండాయిజం చేస్తే తొక్కినార తీ స్తా అని మంత్రి జగదీశ్‌ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మోడల్‌ మార్కెట్‌ సముదాయంలో ఏర్పాటు చేసిన జూకి మిషన్స్‌ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ లో చేరేటప్పుడే చెప్పిన..ఆ బడి లో చదివిన చదువు,మా బడిలో చదివితే నడవదు అని, మంది భూములను ఆక్రమిస్తే,మందిని ఇబ్బంది పెడితే నా వెంట ఉండే వాళ్లనయినా సరే సహించలేదు.. నా ఎంబడి ఉన్న వాళ్ళనయినా సరే నాకు దగ్గరొళ్లయినా సరే జైలుకు పంపిస్తా అని మంత్రి పేర్కొ న్నారు.ఈ వార్నింగ్‌ వట్టె జనయ్య యాదవ్‌ కు మంత్రి ఇచ్చారని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు