Friday, July 26, 2024

హైదరాబాద్‌ వేదికగా ‘‘ఎలివేట్ ఎక్స్‌పో’’ పేరుతో దక్షిణాదిలోనేఅతిపెద్ద మార్కెటింగ్, టెక్నాలజీ ఎగ్జిబిషన్..

తప్పక చదవండి
  • నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జూలై 20, 21 తేదీల్లో కొనసాగుతున్న మార్కెటింగ్ ఎక్స్‌పో..

నగరంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ వేదికగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ ‘ఎలివేట్ ఎక్స్‌పో’ గురువారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను జూలై 20వ తేదీన తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ సెక్రటరీ కాళీచరణ్ ఎస్ ఖర్తాడే, ఐఏఎస్‌, మిస్టర్ వరల్డ్, ప్రొఫెషనల్ బాడీబిల్డర్‌ మీర్‌మోహతేషామ్ అలీ ఖాన్‌లు ప్రారంభించారు. ఈథోస్ ఇమాజినేషన్ ఫౌండర్-సీఈఓ ప్రసాద్ మోడేపల్లి నేతృత్వంలో ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద మార్కెటింగ్ ఎక్స్‌పోగా ‘‘ఎలివేట్ ఎక్స్‌పో’ను చెప్పవచ్చు. స్థానికంగా ఆవిష్కృతమైన వినూత్న మార్కెటింగ్ నిపుణులకు ఎలివేట్ ఎక్స్‌పో అద్భుత వేదికగా నిలుస్తుంది. ఈ ప్రదర్శన జేఆర్‌సీ ట్రేడ్ అండ్ ఫెయిర్ సెంటర్‌లో జూలై 20, 21 తేదీల్లో కొనసానుంది. మార్కెటింగ్ ఔత్సాహికులకు, పరిశ్రమల ప్రముఖులకు, అంకుర సంస్థలకు విభిన్న వేదికలపై అద్భుత ఆవకాశాలను అందించడానికి వారధిగా నిలుస్తుంది.

మార్కెటింగ్‌ రంగంలోని నిపుణులను అనుసంధానం చేయడానికి, వారి ఆవిష్కరణలను పంచుకోవడానికి ఏకైక అవకాశం ‘ఎలివేట్ ఎక్స్‌పో’. ఇందులో పాల్గొనేవారు ముఖ్యమైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవచ్చు, వినూత్న ఆలోచనలను పంచుకోవచ్చు, అంతేకాకుండా భవిష్యత్‌ మార్కెటింగ్ ప్రయత్నాలకు ఉపయోగపడే సహాకారాలను పొందవచ్చు. ప్రస్తుత మార్కెటింగ్ రంగం నిరంతర అభివృద్ధి దిశలో కొనసాగుతుంది, ఈ తరుణంలో విపరీతమైన పోటీ వాతావరణంలో అగ్రగామిగా నిలవడానికి తాజా ట్రెండ్‌లు, నూతన విధానలాలు అవగాహాన తప్పనిసరి. ఎలివేట్ ఎక్స్‌పో అనేది మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, హెచ్‌ఆర్, ఐపీ, టెక్నాలజీ రంగాలలో తాజా పోకడలు, పురోగతిని సమగ్రంగా చూపించే ఏకైక ప్రదర్శన.ఈ ఎక్స్‌పో మార్కెటింగ్, డిజైన్, అడ్వర్టైజ్‌మెంట్‌లో అత్యాధునిక పద్దతులను చేరువ చేస్తుంది. స్టార్టప్ కంపెనీలు, మార్కెటింగ్ మేనేజర్లు-డైరెక్టర్లు, డిజిటల్ మార్కెటర్లు, బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్ నిపుణులు, బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్స్, డిజిటల్ అండ్ ఇన్నోవేషన్ హెడ్‌లు, బిజినెస్ ఓనర్లు, హెచ్‌ఆర్ మేనేజర్లు అండ్ డైరెక్టర్లు, విద్యార్థులు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్యార్థులతో 75కు పైగా టాప్‌ మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీలతో కలవడానికి, వారితో భాగస్వామ్యం కావడానికి సహాకారంగా ఈ కార్యక్రమం స్వాగతం పలుకుతుంది.

- Advertisement -

ఈ ఎక్స్‌పో ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డ్ సెక్రటరీ కాళీచరణ్ ఎస్ ఖర్తాడే మాట్లాడుతూ.., హైదరాబాద్‌లో అతిపెద్ద మార్కెటింగ్ ఈవెంట్ ఎలివేట్ ఎక్స్‌పోను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఎక్స్‌పో విక్రయదారులు వినూత్న ఆలోచనలను అన్వేషించడానికి, పరిశ్రమల అధిపతులతో అనుసంధానం కావడానికి, వారి మార్కెటింగ్ వ్యూహాలను విశ్వవ్యాప్తం చేయడానికి ఒక ప్రత్యేకమైన వేదికను సూచిస్తోంది. తెలంగాణలో స్టార్టప్స్‌, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే మా విధానానికి ఈ ఎలివేట్ ఎక్స్‌పో సంపూర్ణంగా సరిపోతుందని తెలిపారు. మిస్టర్ వరల్డ్ ప్రొఫెషనల్ బాడీబిల్డర్ మీర్ మొహతేషామ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, “ఎలివేట్ ఎక్స్‌పో అనేది మార్కెటింగ్ నిపుణుల మధ్య జ్ఞానాన్ని పంచుకోవడం, సహకారాన్ని పెంపొందించడానికి హామీ ఇచ్చే ఒక ఉత్తేజకరమైన కార్యక్రమం. ప్రతి విజయవంతమైన వ్యాపారానికి మార్కెటింగ్ అనేది వెన్నెముకలా పనిచేస్తుంది. తాజా ట్రెండ్స్‌, నూతన సాంకేతికతలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా కీలకం. వారి సంస్థల ఆవిష్కరణలు, సృజనాత్మకతను పెంచడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయని అన్నారు.

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ ‘ఎలివేట్ ఎక్స్‌పో’ గురించి ఈథోస్ ఇమాజినేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రసాద్ మోడేపల్లి మాట్లాడుతూ.., “మార్కెటింగ్ ఔత్సాహికుడిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా తాను ఈ ఎలివేట్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నందుకు ఉత్సాహాంగా ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా విక్రయదారులతో అనుసంధానం కావడానికి, పరిశ్రమ నిపుణుల నుంచి పలు అంశాలను నేర్చుకోడానికి ఒక అసాధారణమైన వేదికను అందిస్తున్నాం. వ్యాపారాల కోసం కొత్త ఆవిష్కరణలు, అధునాతన మార్పులను ఆహ్వానించడం వలన విభిన్న అవకాశాలకు చేరువ కావొచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద మార్కెటింగ్ ఎక్స్‌పో కేవలం నెట్‌వర్కింగ్ ఈవెంట్ మాత్రమే కాదు.., ఇది స్ఫూర్తిని, విఙ్ఞానాన్ని, సాధికారతను కల్పించే ధృడమైన నిశ్చయంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఈ ఎక్స్‌పో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, హెచ్‌ఆర్, ఐపీ అండ్ టెక్నాలజీలో నిపుణులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదర్శన.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు