- సూటిగా ప్రశ్నించిన తీన్మార్ మల్లన్న..
- ఇక్కడ నుండే ఇక బీసీలకు రక్షణ..
- అక్టోబర్ మొదటి వారంలో ఐదు లక్షల మంది
బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం : మల్లన్న - ఎన్నికల టైం లోనే బీసీ నినాదం గుర్తొస్తుంది : మన తొలి వెలుగు రఘు..
హైదరాబాద్ : తమకు పార్టీలతో పొత్తు కాదని, కులాలతోనే పొత్తు అని తెలిపారు తీన్మార్ మల్లన్న.. హైదరాబాద్ తాజ్ కృష్ణలో బీసీల మీటింగ్ గ్రాండ్ గా జరిగింది.. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ లెక్క తేలిపోయింది.. ఇప్పుడు బీసీల లెక్క బలంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా కులాల పొత్తుతో కూడిన జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని.. అన్ని బీసీ కులాల నుండి 5 లక్షల మంది బీసీ సభలలో పాల్గొనాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం మొట్టమొదటిగా మంత్రి పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఎన్నికలపై బీసీ కులాల చర్చ అనే పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు బీసీ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ముదిరాజ్ నాయకులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా.. రాజకీయ పార్టీలు మాట్లాడకుండా మౌనంగా గమనిస్తున్నాయని చెప్పారు. పద్మశాలీలు కూడా కోరుట్లలో బహిరంగ సభ పెట్టినా ఏ ఒక్క పార్టీ స్పందించలేదన్నారు. బీసీల్లో ఉన్న ప్రతి కులం నోరు విప్పాలన్నారు. తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయిపోయాయని, ఇక బీసీల ఉద్యమమే ఉందన్నారు. మన కోసం మనం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ 100 మీటర్లు తోతుకు పాతి పెడతానంటే వార్తనా …మేము 200 మీటర్ల లోతుకు పాత పెడతాం అని హెచ్చరించారు..
తీర్మానాలు :
బీసీ వర్కింగ్ కమిటీ ఏర్పాటు.. రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను ఓడించాలి. రేవంత్ రెడ్డిని కొడంగల్ లో, కిషన్ రెడ్డి అంబర్ పేటలో ఓడించాలి. బిఆర్ఎస్ పార్టీ బీసీల అన్యాయం చేసింది కాబట్టి కేసీఆర్ ను గజ్వేల్, కామారెడ్డిలో ఓడించాలి. బీసీల సభలను కవర్ చేయకుండా చిన్న చిన్నగా చూస్తున్న వీడియో ఛానలను బీసీల ఇండ్ల నుండి బహిష్కరించాలి.. బిసిల సమస్యలను ఆత్మగౌరవం కాపాడే మీడియా ఛానలను భుజాలపైన ఎత్తుకోవాలి. నీలం మదను పటాన్చెరువు ప్రజలు గుండెపైన రాసుకున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బీసీలు ఓడిస్తారు. అవకాశం వస్తే ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ముదిరాజ్ కులస్తులు కావాలి. రేపు జరగబోయే బీసీల సభ బతుకో సావు తేలిపోతుంది. బీసీ వర్కింగ్ కమిటీ ఏర్పాటు.. త్వరలోనే 5 లక్షల మంది బీసీ లతో భారీ బహిరంగ సభ.
దాసు సురేష్, బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్, మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25 స్థానాల నుండి బీసీ నేతలను చట్టసభలకు పంపించాలి. బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా పోరాటం చేయాలి. సామాజిక తెలంగాణ కావాలంటే బీసీ నేత సీఎం కావాలి.
తొలి వెలుగు రఘు మాట్లాడుతూ.. ఎన్నికల టైం లోనే బీసీ నినాదం ఎందుకు గుర్తొస్తుంది అదే ప్రశ్న. బీసీల రాజ్యాధికారం దిశగా బీసీలు కలిసి ముందుకు పోవాలి.
కేసిఆర్ ను ఓడించాలి.. మన హక్కులను సాధించుకోవాలి.
మహేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముదిరాజ్ జాతిని కేసీఆర్ మోసం చేశారు. పటాన్చెరువులో నీల మదును రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తాం. నీలం మధు ఆధ్వర్యంలో లక్ష మందితో తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన సభకు వస్తాం. మంత్రి హరీష్ రావు నీలం మధును తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు. నీలం ఎమ్మెల్యే అయితే 20 మంది ఎమ్మెల్యే ను తయారు చేసేదని బయనుడొలన చెందుతున్నారు. నీలం మధు అడుగు బలహీన వర్గాల తరఫున ఎన్నికల్లో పోటీ చేయించి భారీ మెజార్టీతో గెలిపిస్తాం అభ్యర్థికి బొంద పెడతాం.
లాల్ కృష్ణ, బీసీ నేత మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన బీసీలను బానిసల్లాగా చూస్తున్నారు. తీన్మార్ మల్లన్న బలహీన వర్గాల కోసం జైలుకు వెళ్లారు.
మల్లన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. భూముల అమ్ముకునైనా ఎన్నికల్లో పోటీలు చేయాలి.. బానిస బతుకుల బతకకూడదు. రాష్ట్రంలో ఉప్పగా బీసీ జనాభా ఉంది… మల్లన్న పెట్టే మీటింగ్ కు అధిక సంఖ్యలో పాల్గొనాలి. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో రెడ్డిని ఓడిస్తామని తీర్మానం చేయాలి.