Monday, May 20, 2024

వర్షం పడితే నరకమే..!

తప్పక చదవండి
  • మురిగిన నీరు దుర్వాసనతో పాఠశాల..!
  • ఒక వైపు డెంగ్యు జ్వరాలతో ఆస్పత్రుల పాలు..!
  • జిల్లా ప్రజా పరిషత్‌ పాఠశాల ఆవరణ బురదమయంగా ఉన్న వైనం..!
  • పట్టించుకోని సంబంధిత అధికారులు..!

చెన్నారావుపేట : మండల కేంద్రంలోని చెన్నారావుపేట జిల్లా ప్రజా పరిషత్‌ పాఠశాల మొత్తం బురదమయంతో అవస్థలు చిన్నపాటి వర్షానికి ప్రభుత్వ పాఠశాల నరకాన్ని తలపిస్తుంది.పాఠశాలల ఆవరణల్లో మోకాళ్ల లోతులో బురద నీరు నిలిచిపోతుంది.డెంగ్యూ ఫీవర్లు దుర్వాసన మురుగ నిరు ఇబ్బందికరంగా మారుతున్నాయి.క్రీడా ప్రాంగణం కనీసం అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చాలా మంది విద్యార్థులు చదువుతున్నారు.వర్షపు నీరు పాఠశాల ఆవరణలో నిలిచిపోతుం డడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణలో మట్టి కుప్పలు అక్కడక్కడ ఉండడంతో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గలేక పెద్దచెరువులా మారింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు