Saturday, May 18, 2024

రిజిస్ట్రేషన్ ఆఫీస్ లకు ప్రభుత్వ భవనాలు కట్టాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన నారగోని ప్రవీణ్ కుమార్..

హైదరాబాద్ : తెలంగాణలో 142 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లు 33 జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ లు ఉన్నాయి.. ఇందులో 150 ఆఫీస్ లు రెంటెడ్ భవనాలలో ఉన్నాయి.. సుమారు 20 కోట్ల రూపాయలు రెంట్ కడుతుంది సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం.. భూములను, హెచ్ ఎం డీ ఏ లేఅవుట్లు చేసి వేలం వేసి అమ్మడం తెలిసిన ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆఫీసులకు సొంత భవనాలు కట్టాలన్న సోయి లేకపోవడం విచిత్రం.. ప్లాట్ల అండ్ ఇండ్ల రిజిస్ట్రేషన్ ల ద్వారా సుమారు 25 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.. ఉప్పల్, నారాపల్లి ఆఫీస్ లు అద్దె భవనాలలో ఉన్నాయి.. వీటికి దగ్గర లోనే హెచ్.ఎం.డీ.ఏ. ఉప్పల్ భగాయత్, మేడిపల్లి సర్వే నెంబర్ 62లో ప్లాట్లు చేసి వేలం పాట లో అమ్మడం జరిగింది.. ఇప్పుడు ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ను మరో అద్దే భవనానికి మారుస్తున్నారు.. వెంటనే నారపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ను మేడిపల్లి సర్వే నెంబర్ 62లో గల హెచ్.ఎం.డీ.ఏ. లేఅవుట్ లో ఒక ప్లాట్ కేటాయించి అక్కడ భవనం నిర్మించి అందులోకి మార్చాలి.. అట్లాగే ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ను ఉప్పల్ భాగాయత్ లో చేసిన హెచ్.ఎం.డీ.ఏ. లేఅవుట్ కు మార్చాలని రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లకు ప్రభుత్వ స్థలాలలో భానాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు