Wednesday, September 11, 2024
spot_img

కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్ళండి

తప్పక చదవండి
  • రెండు పార్టీల మోసాన్ని వివరించండి..
  • నా కోసం 19 రోజులు కష్ట పడండి..
  • మీ భవిష్యత్తు కు నాది పూచి : నీలం మధు ముదిరాజ్
  • చిట్కుల్ లో బీఎస్పీ కార్యవర్గ సమావేశం
  • మద్దతు తెలిపిన సిద్దిపేట బీఎస్పి అభ్యర్థి చక్రధర్ గౌడ్
  • ఐనోలు, మధారం, వివిధ గ్రామాల నుండి బీఎస్పీలో భారీ చేరికలు

మనల్ని మోసం చేసిన రెండు పార్టీల కుతంత్రాలను ప్రజలకి వివరిస్తూ చైతన్యవంతుల్ని చేయాలని పటాన్ చెరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం చిట్కుల్ గ్రామంలో బిఎస్పీ ముఖ్య కార్యకర్తలు, కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెండు పార్టీ లు మనల్ని మోసం చేశాయని ఎవరు అధైర్య పడవద్దని పార్టీ లు మోసం చేసిన ప్రజలంతా మనవైపే.. ఉన్నారని ఎన్నికలలో మనం విజయ డాంకా మోగించడం ఖాయమని భరోసా ఇచ్చారు. నాకోసం ఈ 19 రోజులు మీ పూర్తి సమయాన్ని కేటాయించి విస్తృతంగా ప్రజల్లోకి మన ఆత్మగౌరవ నినాదాన్ని బహుజన వాదాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 19 రోజులు మీరు కేటాయించి గెలిపిస్తే మీ భవిష్యత్తుకు నాది పూచి అని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడి వలె పని చేస్తూ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తూ బీఎస్పీ పార్టీ బహుజన వాదాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి మేము అండగా ఉంటామని పలువురు బీఎస్పీ లో చేరారు. నీలం మధుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఐనోల్, మాధారం గ్రామలు , వివిధ గ్రామాల నుండి పలు పార్టీలకి చెందిన సుమారు 100 మంది బీఎస్పీ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా వారికి నీల మధు ముదిరాజ్ బీఎస్పీ కండువా వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగుల జీవితాలలో వెలుగులు నింపడానికి పోరాటం చేస్తున్న నీలం మధు ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు