Friday, May 17, 2024

దివ్వెల వెలుగులో అయోధ్య

తప్పక చదవండి
  • 24 లక్షల ప్రమిదలaతో దీపోత్సవం
  • వరల్డ్ రికార్డ్‌ కోసం సర్కార్ ప్రయత్నం
  • గతేడాది 15.76 లక్షల దీపాలను వెలిగించిన ప్రభుత్వం

ఈ దీపావళికి అయోధ్యలో మరో గిన్నిస్ రికార్డు నమోదుకానుంది. పండగ నాడు సరయూ నదీ తీరంలో దాదాపు 24 లక్షల మట్టి దీపాలను వెలిగించి.. ఘనంగా దీపోత్సవం నిర్వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేబినెట్ మంత్రులు, 50కి పైగా దేశాల హైకమీషనర్లు, రాయబారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. గత ఏడాది దీపావళికి 15.76 లక్షల దీపాలను వెలిగించి యూపీ ప్రభుత్వం రికార్డు నమోదు చేసింది. అయితే ఆ రికార్డును బద్ధలు కొట్టి మరో ఘనత సాధించడానికి యోగి ప్రభుత్వం సిద్దమైంది. అయోధ్యలోని రామ్ కి పైడిలో ఉన్న 51 ఘాట్‌లలో 24 లక్షలకు పైగా దీపాలను వెలిగించాలని.. దాని ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లైట్ అండ్ సౌండ్ సిస్టమ్‌తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇది వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ఉత్తర్‌ప్రదేశ్ అధికారులు వెల్లడించారు. అయోధ్య నగరంతోపాటు ఉత్తర ప్రదేశ్ చరిత్రను ప్రదర్శించేందుకు దేశంలోనే అతి పెద్ద భారీ డిజిటల్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వాలంటీర్లకు దీపాలను వెలిగించడం, వాటి నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. 27 కళాశాలలు, అయోధ్యలోని 19 ఇంటర్మీడియట్ కాలేజీలు, రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీల నుంచి ఈ వాలంటీర్లను తీసుకువచ్చారు. రామ్ కి పైడిలోనే దాదాపు 65 వేల దీపాలను వెలిగించనున్నారు. 51 ఘాట్లతో పాటు అయోధ్యలోని ముఖ్యమైన మతపరమైన, చారిత్రక ప్రదేశాల్లో కూడా ఈ దీపాలను వెలిగించేందుకు సిద్ధం చేశారు. అయితే ఈ దీపాలను లెక్కించడానికి 196 దీపాలు చొప్పున 12500 బ్లాక్‌లలో వెలిగించనున్నారు. మరోవైపు.. దీపావళి రోజున విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగడానికి అధికారులు, ఉద్యోగుల సెలవులను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు