Saturday, April 27, 2024

కామారెడ్డి కలెక్టరేట్‌లో ఘరానా మోసం

తప్పక చదవండి
  • ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట టోకరా

కామారెడ్డి : కామారెడ్డి కలెక్టరేట్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ కలెక్టర్‌ కార్యాలయంలో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు జారీ చేసింది. నిరుద్యోగుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి ఈ నకిలీ నియామక పత్రాలు అంటగట్టింది. ఆ నియామక పత్రాలు తీసుకుని కార్యాలయాలకు వెళితే అవి తనఖీ చేసిన అధికారులు నకిలీ వని తేల్చి చెప్పారు. దీంతో బాధితులు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. నకిలీ నియామక పత్రాలు జారీ చేసిన ప్రైవేట్‌ ఏజెన్సీ హైదరాబాదులోని మల్కాజ్‌గిరికి చెందిన సంస్థగా గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు