Thursday, May 16, 2024

ఎర్రబెల్లి నా పౌరసత్వానికి ఎదురు పడ్డావు కానీ..నా వారసత్వానికి ఎదురు పడలేవు

తప్పక చదవండి
  • గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమండల ఝాన్సీ రెడ్డి

తనతో ఎన్నికల్లో ఎదురు పడలేక తన ఒంటెద్దు పోకడలు అభివృద్ధి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల్లో పోటీ పడలేక తన పౌరసత్వానికి అడ్డుపడి ఎన్నికల్లో ఆపగలిగారు గాని నా వారసత్వానికి అడ్డుపడే ధైర్యం ఎర్రబెల్లికి లేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దర్దే పెళ్లి, కొండాపురం, టీఎస్ కే తండా, హట్య తండా, మల్లంపల్లి, తదితర గ్రామాలలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజలు ఆశించి మూడు పర్యాయాలు అధికారాన్ని కట్టబెడితే అభివృద్ధిని పడకేసి తన ఇమేజ్ను పెంచుకునే కార్యక్రమాలే చేశాడు తప్ప నియోజకవర్గంలో 6 మండల కేంద్రాలలో కనీసం వెనుకబడిన పిల్లల చదువుల కోసం ప్రభుత్వ కళాశాలలు నిర్మించలేని దుస్థితిలో ఉన్నాడని రైతాంగానికి అవసరమైన మార్కెట్ సౌకర్యం కానీ పాలసీతుల కేంద్రం కానీ ఇక్కడి జనాభా అంతా వలస వెళుతున్న వారికి ఉపాధి చూయించాలనే కనీస జ్ఞానం లేని ఎర్రి దద్దమ్మ ఎర్రబెల్లి అని ఆమె ఎద్దేవా చేశారు .పాలకుర్తి నియోజకవర్గంలో సేవా చేయాలనే తపనతో నా వ్యాపారాలు అన్నీ వదులుకొని నేనొస్తే నా వల్ల తన అధికారానికి భంగం వాటిల్లుతుందనే కుటిల బుద్ధితో ఎర్రబెల్లి దయాకర్ రావు తన పౌరసత్వాన్ని అడ్డుకోగలిగాడు గాని ప్రజల్లో ఉన్న అభిమానాన్ని నా వారసత్వం రూపంలో చూయించి ఎర్రబెల్లిని పర్వతగిరి కి పంపిస్తానని ఆమె సవాలు విసిరారు. ఈ ప్రాంత ప్రజలు తనను ఆదరించి తన కోడలైన యశస్విని రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చినంక తప్పకుండా అమలు చేసేందుకు మేము కృషి చేస్తామని ఆమె ఈ సందర్భంగా అన్నారు. రైతుల రుణమాఫీ, నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకొనున్నట్లు ఆమె తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు నెల నెల 2500 రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు ఝాన్సీ రెడ్డి తెలిపారు. ప్రజలు ఎలాంటి అవినీతి మరకలేని తమకు అవకాశాన్ని ఇచ్చి అభివృద్ధి చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు .ముత్తారం గ్రామ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు భూమా రంగయ్య .బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ. మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి. ఆయా గ్రామాల బాధ్యులు జలగం కుమారస్వామి .మాజీ ఎంపీపీ గడ్డం యాకసోమమయ్య. వంగాల సుధాకర్. భూముల దండయ్య .లావుడియా భాస్కర్. తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు