Tuesday, September 10, 2024
spot_img

శిలాజ ఇంధనాలను అంతం చేయండి

తప్పక చదవండి
  • భూ గ్రహాన్ని రక్షించే చర్యలు కావాలి
  • అంతర్జాతీయ వేదికపై 12 ఏళ్ల మణిపూర్‌ బాలిక నిరసన

న్యూఢిల్లీ : దుబాయ్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సమావేశం 2023 లో మణిపూర్‌కు చెందిన 12 ఏళ్ల వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం నిరసన తెలిపారు. కాన్ఫరెన్స్‌ జరుగుతుండగా ఒక్కసారిగా వేదికపైకి వచ్చిన బాలిక ’శిలాజ ఇంధనాలను అంతం చేయండి. మన గ్రహాన్ని, భవిష్యత్తును రక్షించండి.’ అనే ప్లకార్డును ప్రదర్శించింది. శిలాజ ఇంధనాల వాడకానికి వ్యతిరేకంగా ఆమె ఈ నిరసన తెలిపారు. ప్లకార్డుతో వేదికపైకి దూసుకొచ్చిన ఆమె ఓ చిన్న ప్రసంగం కూడా చేశారు. ఆమె ప్రసంగానికి మెచ్చి అక్కడ ఉన్నవారంతా చప్పట్లతో లిసిప్రియను అభినందించారు. సీఓపీ 28 డైరైక్టర్‌ జనర్‌ అంబాసిడర్‌ మజిద్‌ అల్‌ సువైదీ మాట్లాడుతూ లిసిప్రియ ఉత్సాహాన్ని ప్రశసించారు. ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులతో ఆమెకు మరోసారి చప్పట్లు కూడా కొట్టించారు. కాగా లిసిప్రియ వేదికపై నిరసన తెలుపుతుండగా కార్యక్రమం నిర్వహకులు ఆమెను నిర్భందించి బయటికి తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన 2 నిమిషాల 17 సెకన్ల వీడియోను లిసిప్రియ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘ఈ నిరసన తర్వాత వారు నన్ను 30 నిమిషాలకుపైగా నిర్బంధించారు. నా ఏకైక నేరం వాతావరణ సంక్షోభానికి ప్రధాన కారణమైన శిలాజ ఇంధనాలను తొలగించమని అడగడం. ఇప్పుడు వారు నన్ను సీఓపీ 28 నుంచి తొలగించారు. నా నిరసనకు సంబంధించిన పూర్తి వీడియో ఇక్కడ ఉందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మరొక పోస్ట్‌లో ‘శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు నా బ్యాడ్జ్‌ను నిలిపివేయడానికి కారణం ఏమిటి? మీరు నిజంగా శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా నిలబడితే, మీరు తప్పనిసరిగా నాకు మద్దతు ఇవ్వాలి. మీరు వెంటనే నా బ్యాడ్జ్‌లను విడుదల చేయాలి. ఇది ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సూత్రానికి విరుద్ధం. ఐక్యరాజ్యసమితిలో నా స్వరం వినిపించే హక్కు నాకుంది. కాబట్టి నా బ్యాడ్జ్‌ను నిలిపివేయడం బాలల హక్కుల ఉల్లంఘన, దుర్వినియోగం కిందికి వస్తుందని లిసిప్రియ కంగుజం ట్వీట్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు