Monday, May 6, 2024

నేటి విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయండి – డీ.వై.ఎఫ్.ఐ.

తప్పక చదవండి
  • విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావేద్..
    నేడు నిర్వహించ తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయాలని డీ.వై.ఎఫ్.ఐ. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి జావిద్ జావేద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నేడు విద్యాసంస్థల బంద్ కి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నిర్వహిస్తున్న బంద్ కి వామపక్ష యువజన సంఘాలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలిపాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో వసతులు, ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ప్రభుత్వ బడులకు కాకుండా ప్రైవేట్ బడులకు వెళ్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, డీఈవో, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విచ్చల విడిగా వేల రూపాయలు వసూలు చేస్తూ.. తల్లి దండ్రులను దోపిడీ చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.. విద్యకు 30 శాతం నిధులు కేటాయించి, విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నేడు నిర్వహించబోయే విద్యాసంస్థల బందులో పాఠశాల, కళాశాలల యజమాన్యాలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎండీ జావేద్ విజ్ఞప్తి చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు