Thursday, June 13, 2024

ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి అవసరమా?

తప్పక చదవండి
  • బంగారు తెలంగాణ అంటే గడీలల్లో ఉండి చేసేదేనా
  • ప్రగతి భవన్ లోకి రావాలంటే అనుమతి తప్పనిసరా..?
  • కేసీఆర్ పాలనను చీదరించుకుంటున్న తెలంగాణ ప్రజలు
  • పదేళ్ల కేసీఆర్ పాలన భబ్రాజమానం భజగోవిందమేనా
  • కారును కూల్చి… సారును సాగనంపే కాలమొచ్చింది..
  • గత సీఎంలు ప్రజాదర్బార్ నిర్వహించేవారు.. మీరెందుకు చేయలేదు
  • ఎప్పుడు లేని తొందర.. ఎన్నికల వేళ ఎందుకు..?
  • తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై మండిపడ్డ బిజెపి కేంద్ర – రాష్ట్ర సమన్వయకర్త మరియు
    SARAL ఇంచార్జ్ నూనె బాల్ రాజ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అంతా భబ్రాజమానం.. భజగోవిందం..! లాగానే ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పేవి, ఒకటి చేసేది ఒకటి ఉంటుందని ఇప్పుడు కెసిఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని పదేళ్లపాటు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలను నిండా ముంచాడని ఇలాంటి ముఖ్యమంత్రిలను మునిపెన్నడు చూడలేదని ఈయన పాలన నిజాం సర్కార్ లోని రజాకారుల పాలన లాగా ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. 2014 అధికారంలోకి వచ్చినప్పుడు హైదరాబాదును డల్లాస్ గా మారుస్తానని, వరంగల్ ను సింగపూర్ చేస్తానని కరీంనగర్ ను ఇస్తాంబుల్ చేస్తానని ఏతుల మాటలు చెప్పి, బంగారు తెలంగాణ అని ప్రజల చెవుల్లో పూలు పెట్టి ,తాను తన కుటుంబం మాత్రం బంగారుమయం చేసుకున్న ఘనత కెసిఆర్ కి దక్కుతుందని, ప్రజల డబ్బుతో ప్రగతి భవన్ కట్టుకొని అందులో వెనకటి దొరల గడిల పాలనను తన దొరతనాన్ని చూపించుకుంటున్నాడు. హైదరాబాద్ చుట్టుముట్టు విలువైన భూములను తన అనునయులకు కట్ట పెట్టుకున్నాడు. తన వర్గాన్ని తన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్ప తెలంగాణను మాత్రం ఎక్కడ అభివృద్ధి చేయలేదు. ఇక్కడ బంగారు తెలంగాణ అన్నది ఒక బ్రమ మాత్రమే అని బిజెపి కేంద్ర – రాష్ట్ర సమన్వయకర్త మరియు SARAL ఇంచార్జ్ నూనె బాల్ రాజ్
మండిపడ్డారు.

అనుమతి లేకుండా మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా లోపలికి రాకూడద

- Advertisement -

ప్రగతి భవన్ గేటు ముందు అనుమతి లేనిది లోపలికి రాకూడదు అనే బోర్డు తగిలించుకొన్నారు. ఇలా ఉంటే సామాన్య ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థిలో తెలంగాణ ప్రజలు ఉన్నారని, గతంలోముఖ్యమంత్రులు ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన అనే విధంగా నేరుగా ప్రజలను కలిసి, ప్రజలు అడిగిన సమస్యలను వారు తీర్చేవారు. వై.యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంపు కార్యాలయంలో వారంలో ఒకరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకునేవాడని అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని ప్రజలందరికి తెలుసు. ఇప్పుడు కెసిఆర్ మాత్రం ప్రజలకు దొరకడని, ఎక్కడైనా సమావేశాలు జరిగినప్పుడు లేదా మీడియా సమావేశాలలో పాల్గొన్నప్పుడు ఎవరైనా విలేకరులు ప్రశ్నిస్తే వారిని అవహేళన చేయడం దొరకు అలవాటుగా మారింది. ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజలకు ఏం సేవ చేస్తాడని అందరిలో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నందున ఉత్తుత్తి హామీలతో ఉదరగొడుతూ, ప్రజలను మూడో సారి బురిడీ కొట్టించి, దొర కాస్తా దేవుడి అవతారం నేనే అని ప్రకటించినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రజలు అంత ఈజీగా కెసిఆర్ ను నమ్మడం లేదు. తెలంగాణ ప్రజలు కేసిఆర్ అసలు రూపం పసిగట్టారు.

కెసిఆర్ పాలనపై ప్రజల చీదరింపు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై చీదరించుకుంటున్నారు. తెలంగాణ వస్తే సామాజికంగా, ఆర్థికంగా, ఎదుగుతాం అనుకున్న తెలంగాణ ప్రజలు ఆర్థికంగాఅధోగతిపాలవుతున్నారు. రాష్ట్రంలో పెరిగిన పప్పులు, ఉప్పులు, వంటనూనె, బియ్యం, కూరగాయలు, మొదలగు నిత్యవసర సరుకుల ధరలు మొదలుకొని, కరెంటు బిల్లులు, బస్సు చార్జీలు, మద్యం ధరలు, పెట్రోలు, వంటగ్యాసు ధరలు విపరీతంగా పెరగడం తో తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణ రాకముందు, కెసిఆర్ వచ్చినంక కెసిఆర్ నిజ స్వరూపంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా.. పరిపాలన.? ఇదేనా.. తెలంగాణ ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ.? అంటూ చీదరించుకుంటున్నారు. తెలంగాణ మోడల్ అంటే ప్రజల మాన, ప్రాణాలను దోచుకోవడమా.? ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన అంటూ యువత కెసిఆర్ పై తమ కోపాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తూ ఆయన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నారు. సారు మీరు మారరు.! మేమే మారాలి… మిమ్మల్ని మార్చాలి.!! అది ఓటు ద్వారా సాధ్యమవుతుందని మాకు తెలుసు సారు.. అంటూ ఫేస్ బుక్, వాట్సాప్ ,ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ,లాంటి వేదికలను వాడుకుంటూ, కెసిఆర్ పాలనపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు కక్కుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కెసిఆర్ సార్ ను గద్దె దింపి, ఇంట్లో కూర్చో పెట్టాలని తెలంగాణ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండని ముఖ్యమంత్రి అవసరమా.?

ప్రజలను కలవని ప్రజలకు అందుబాటులో ఉండని ప్రజల సమస్యలను తీర్చని ముఖ్యమంత్రి మనకు అవసరమా? అంటూ యావత్ తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని గద్దె దింపేదాకా వదలొద్దని గ్రామ గ్రామాన అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలు, ప్రభుత్వ అధికారులు, పనిచేయకపోతే స్థానిక ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే కు చెప్పుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే పని చేయకుంటే మంత్రికి చెప్పుకుంటారు. మంత్రి పని చేయకుంటే ముఖ్యమంత్రికి చెప్పుకుంటారు కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి చెప్పు కోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారంటే దానికి ముఖ్యమంత్రి కారణమని, ప్రజలను కలవని ముఖ్యమంత్రి మన తెలంగాణ ప్రజలకు అవసరమాని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారును సాగనంపుదామని ప్రజలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు