Monday, May 20, 2024

ఎన్నికలలో విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక బిఆర్ఎస్ పార్టీని ఓడించండి.

తప్పక చదవండి
  • పిలుపునిచ్చిన ఏ.ఐ.ఎస్.ఎఫ్. ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్

హైదరాబాద్ : రాబోయే 40 రోజులలో బిఆర్ఎస్ పార్టీ ఓడించాలని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ భవిష్యత్తు కార్యచరణ ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీడియా సమావేశం ప్రకటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ అనేక విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాల అవలంబించింది కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీనీ చిత్తుచిత్తుగా ఓడించడానికి విద్యార్థులు, నిరుద్యోగులు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గ్యార నరేష్ ఓయూ అధ్యక్షులు లెనిన్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య లు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయం నిర్వీర్యం చేసింది కాకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, కేజీ టు పీజీ ఉచిత విద్య హామీని అమలు చేయకుండా గ్రామీణ పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ పేరిట మూసివేసిందని, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఏ ఒక్క పరీక్షను కూడా పారదర్శకంగా నిర్వహించడంలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలం అయింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దు, వాయిదాల వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయారని, నిరుద్యోగుల ఆత్మహత్యలకు బిఆర్ఎస్ పార్టీ కారణమైందని వారు అన్నారు. ఇటీవల విడుదల చేసిన బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా విద్యారంగ, నిరుద్యోగుల సంబంధించి ప్రస్తావనే లేకపోవడం మరొకసారి నిరుద్యోగలను మోసం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది కాబట్టి వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి లక్ష్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు పనిచేయాలి అని వారు కోరారు. రాబోయే 40 రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో యూనివర్సిటీలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తామని, అదే విధంగా విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించి ఆర్ట్స్ కళాశాల వేదికగా విద్యార్థి, నిరుద్యోగ గర్జన బహిరంగ సభను నిర్వహిస్తామని, బిఆర్ఎస్ వైఫల్యాలతో కూడిన కరపత్రాలను ముద్రించి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో తిరిగి ప్రజలను విద్యార్థులను చైతన్యం చేసి బీఆర్ఎస్ పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఓడించే లక్ష్యంతో పనిచేస్తుందని వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో యూనివర్సిటీ సహాయ కార్యదర్శి ఆరె కంటి భగత్, గంటి రాజు మరియు కాంపల్లి కళ్యాణ్, రాధాకృష్ణ, ప్రసాద్ ,సుమన్ అనిల్ అరుణ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు