Saturday, May 18, 2024

ఎస్వీపీ, టీ-ఎస్ఐజీ ఆధ్వర్యంలో దాన్ ఉత్సవ్..

తప్పక చదవండి

హైదరాబాద్ : దాతృత్వానికి సోషల్ వెంచర్ పార్ట్‌నర్స్ (ఎస్వీపీ) ఇండియా చిరునామాగా మారింది. ఇండియా, తెలంగాణా ప్రభుత్వ అధికారిక సీఎస్ఆర్ సెల్ తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ (టీ-ఎస్ఐజీ), ఎస్వీపీ భాగస్వామ్యంతో అతిపెద్ద గివింగ్ పండుగ దాన్ ఉత్సవ్ 2023ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 8వ తేదీ వరకు ఈ. జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ జరుపుతారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ స్టెప్‌వెల్లో శనివారం దాన్ ఉత్సవ్ లేదా జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ నిర్వహించారు. ఈ ఈవెంట్ విరాళాలు సేకరించే లక్ష్యంతో గూంజ్, రోహిణి ఫౌండేషన్, యాక్సెస్ లైవ్లీహుడ్స్, డిజిటల్ ఈక్విటీ, డెవెన్స్ హోప్, వృద్ధి ఫౌండేషన్, ఐకార్త్య, ఎర్త్ ట్యూన్స్ డిజైన్‌తో సహా ఎనిమిది లాభాపేక్షలేని సంస్థలు పాల్గొంటాయి.

హాజరైన వారు బట్టలు, పుస్తకాలు లేదా ఈ-వ్యర్థాలను విరాళంగా అందించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌లోని అభినయ వాణి నృత్య నికేతన్‌లోని ప్రతిభావంతులైన విద్యార్థులు మంత్రముగ్ధులను చేసే కూచిపూడి నృత్య ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమయాన్ని, వనరులను లేదా డబ్బును విరాళంగా ఇవ్వడం ద్వారా దయతో కూడిన చర్యలకు నాంది పలకవచ్చన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎస్వీపీ ఇండియా హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ రామ్ కౌండిన్య మాట్లాడుతూ.. జంట నగరాల్లో గివింగ్ స్ఫూర్తి విస్తరించిందన్నారు. సికింద్రాబాద్‌లోని 17వ శతాబ్దపు వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చారిత్రాత్మక బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరిసర ప్రాంతాలలో సుమారు ఇరవై వేల మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు వాటర్‌షెడ్‌ను శుభ్రపరచామన్నారు. ఈ సందర్భంగా టీ-ఎస్ఐజీ డైరెక్టర్ అర్చన సురేష్ మాట్లాడుతూ అర్ధవంతమైన మార్పును సృష్టించడానికి మాకు ఒక అవకాశం అన్నారు. ఎస్వీపీతో సహకరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని మద్దతు ఇవ్వాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు