Monday, April 29, 2024

కరెంట్‌ శాఖలో కరప్షన్‌

తప్పక చదవండి
  • టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ నియామకాల్లో గోల్‌ మాల్‌..?
  • అనర్హులకు సబ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు..!
  • ట్రాన్స్‌కో సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌లో క్వాలిఫై కాని క్యాండిడేట్స్‌కు ఎన్పీడీసీఎల్‌ పరీక్షలో టాప్‌ ర్యాంక్స్‌
  • ఎస్పీడీసీఎల్‌ జేఏల్‌ఎం పేపర్‌ లీకేజీ కేసులోని నిందితుడు షేక్‌ సాజన్‌.. ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకు
  • 2018లో ఎన్పీడీసీఎల్‌ 497 పోస్టులకు నోటిఫికేషన్‌.. ఇప్పటికీ 23 మందికి రాని ఉద్యోగాలు, ఉద్యోగాలను బహిరంగాగానే అమ్ముకున్నారని ఆరోపణలు
  • జాబ్స్‌ ఇవ్వాలని సర్కార్‌కు సదరు అభ్యర్థుల వేడుకోలు
  • ప్రభుత్వం సమగ్రంగా విచారిస్తే అప్పటి సీఎండీ గోపాలారావు, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అవినీతి చిట్టా బట్టబయలు

హైదరాబాద్‌ : గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లోని మరో అవినీతి బట్టబయలు అయింది. కేసీఆర్‌ అనుంగు అనుచరుడు, అప్పటి విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, ఆయన తాబేదారైన అప్పటి సీఎండీ గోపాలారావు కనుసన్నల్లోనే ఈ కరప్షన్‌ యవ్వారం జరిగినట్లు అర్థమవుతోంది. ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) 24-05-2018న 497 సబ్‌ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌కు

సంబంధించిన ఎగ్జామ్‌ ను ఎన్పీడీసీఎల్‌ 08-07-2018 నాడు నిర్వహించింది. 31-12-2018న వారికి నియామక ఉత్తర్వులు అందజేసింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు తంతు మొత్తం ఇక్కడి నుంచి మొదలైంది. నోటిఫికేషన్‌ ప్రకారం పరీక్ష నిర్వాహణ, ఇంటర్వ్యూ లు పూర్తి అయినప్పటికీ ఉద్యోగాల భర్తీలో మాత్రం అడ్డగోలు అవినీతి జరిగినట్లు సమాచారం.

- Advertisement -

2018లో ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ వేసిన 497 సబ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ఎన్పీడీసీఎల్‌ 14-09-2018 మరియు 25-09-2018 రెండు విడుతల్లో కలిపి 450 మందికి మాత్రమే కాల్‌ లెటర్స్‌ పంపించడం గమనార్హం. అందుకు అనుగుణంగానే 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసి కాల్స్‌ లెటర్స్‌ పంపింది. అయితే ఉద్యోగ నోటిఫికేషన్‌ లో ఇచ్చిన నెంబర్‌ ప్రకారం మరికొంత మందికి మాత్రం కాల్‌ లెటర్స్‌ రాలేదు. మొత్తం అభ్యర్థులకు సంబంధించిన ప్రొవిజినల్‌ లిస్ట్‌ ను కూడా వెబ్‌ సైట్‌ లో పొందుపరచలేదు. దీంతో 23 మంది అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరి అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం సదరు అభ్యర్థులకు అనుకూలంగా ఆర్డర్‌ పాస్‌ చేసింది. అయినప్పటికీ.. వారికీ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లో న్యాయం జరగలేదు.

ట్రాన్స్‌ కో పరీక్షల్లో క్వాలి ఫై కాలేదు.. ఎన్పీడీసీఎల్‌ ఎగ్జామ్స్‌ లో మాత్రం మెరుగైన ర్యాంక్స్‌

మరోవైపు 2018 ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల జ్షాబితాను పరిశీలిస్తే ఎవరైనా ఇట్టే ముక్కున వేలేసుకోవాల్సిందే. 2018 ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ నోటిఫికేషన్‌ లో అనర్హులు ఉద్యోగాలు సాధించినట్లు వారి గత చరిత్రను చూస్తే అర్థమవుతోంది. గుడా హనుమంత రావు అనే వ్యక్తి గతంలో ట్రాన్స్‌ కో లో సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌ రాశారు. ఆయనకు ఈ ఎగ్జామ్‌ లో కేవలం 26 మార్కులే వచ్చాయి. కానీ, ఇదే అభ్యర్థి ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ పరీక్ష రాయగా.. అందులో 97 మార్కులతో మొదటి ర్యాంకు సాధించడం గమనార్హం. నల్గొండ జిల్లాకు చెందిన షేక్‌ సాజన్‌ గతంలో ట్రాన్స్‌ కో సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌ రాయగా.. కేవలం 19 మార్కులే వచ్చాయి. ఈ పరీక్షల్లో సాజన్‌ అర్హత మార్కులను సైతం పొందలేకపోయారు. కానీ, ఇతనికే ఎన్పీడీసీఎల్‌ ఎగ్జామ్‌ లో 89 మార్కులతో 99వ ర్యాంకు రావడం విస్మయం కల్గిస్తోంది. అంతేకాక సాజన్‌ ఎస్ఫీడీసీఎల్‌ నిర్వహించిన జేఎల్‌ఎం పరీక్షా పత్రం లీకేజీలోనూ నిందితుడిగా ఉండడం గమనార్హం. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకే చెందిన మరోవ్యక్తి మహేశ్‌ భుక్యా ట్రాన్స్‌ కో సబ్‌ ఇంజినీర్‌ పరీక్షల్లో కేవలం 19 మార్కులనే స్కోర్‌ చేయగా.. ఎన్పీడీసీఎల్‌ సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌ లో మాత్రం 94 మార్కులు సాధించి 05వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన మరో అభ్యర్థి చినా భుక్యాది ఇదే పరిస్థితి. ట్రాన్స్‌ కో సబ్‌ ఇంజినీర్‌ ఎగ్జామ్‌ లో ఇతనికి 22 మార్కులే వచ్చాయి. కానీ, ఎన్పీడీసీఎల్‌ సబ్‌ఇంజినీర్‌ పరీక్షల్లో మాత్రం 94 మార్కులు సాధించి 06వ ర్యాంకును కైవశం చేసుకోవడం గమ్మత్తుగా ఉంది. ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే అన్ని అర్హతలు సాధించిన మరో 23 మంది అభ్యర్థులకు మాత్రం ఇప్పటికీ జాబ్స్‌ రాకపోవడం గమనార్హం. మొత్తంగా ఎన్పీడీసీఎల్‌ లో సైతం నల్గొండకు సంబంధించిన నాన్‌ లోకల్‌ కోటా అభ్యర్థులే ఎక్కవ మంది జాబ్స్‌ కొట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదం తా కేసీఆర్‌ సారు అనుంగు అనుచరుడు, అప్పటి విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, సీఎండి గోపాలారావు ల పుణ్యమేననే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 427 మందికి చేపట్టిన నియామకాల్లో లక్షల్లో ముడుపులు తీసుకొని, అనర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలుస్తుంది. ఈ అక్రమ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కలుగజేసుకొని సమగ్రంగా దర్యాప్తు చేస్తే మరిన్ని అవినీతి బాగోతాలు బయటకొస్తాయని బాధితులు అంటున్నారు. సబ్‌ఇంజినీర్‌ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై పూర్తి ఆధారాలతో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.. మా అక్షరం అవినీతిపై అస్త్రం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు