Thursday, June 13, 2024

రేషన్‌ కార్డు విషయంలో గందరగోళం

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్‌ రావు..
  • వంద రోజులు కచ్చితంగా ఓపిక పడతాం
  • కాంగ్రెస్‌ గ్యారెంటీలు, పదమూడు హామీలు ఇవ్వకుండా దాట వేసే ప్రయత్నం చేస్తుంది
  • పథకాల అమలుపై ప్రజల్లో పెద్ద యెత్తున అనుమానాలు
  • గైడ్‌ లైన్స్‌ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పటం ఏంటో అర్థం కావటం లేదు : హరీష్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ అరు గ్యారెంటీల అమలుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలులో ఉన్నాయి. అయితే ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి హరీష్‌ రావు కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై స్పందించారు. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.. వంద రోజులు కచ్చితంగా ఓపిక పడతాం అన్నారు. తాను జిల్లాలో తిరుగుతుంటే కొంత మంది రైతు బంధు అని అడుగుతున్నట్లు వెల్లడిరచారు. కాంగ్రెస్‌ పూర్తి స్థాయి బడ్జెట్‌ పెట్టకుండా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే పెట్టాలని చూస్తోందని తెలిపారు. ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఇవ్వకుండా దాట వేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పథకాల అమలుపై ప్రజల్లో పెద్ద యెత్తున అనుమానాలు ఉన్నాయన్నారు.గైడ్‌ లైన్స్‌ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పటం ఏంటో అర్థం కావటం లేదన్నారు. ఈ స్కీములు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పటం లేదని తెలిపారు. రేషన్‌ కార్డు విషయంలో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. అసలు ఇవి వస్తాయో రావో తెలియదన్నారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెడితే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు కావని వెల్లడిరచారు. మొన్న విడుదల చేసింది శ్వేత పత్రాలు కావు, హామీల ఎగవేత పత్రాలు మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఆన్‌ గోయింగ్‌ స్కీమ్‌ చేస్తేనే వంద రోజుల్లోగా ఈ హామీలు అమలు అవుతాయన్నారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా అలాంటి పరిస్తితి కనపడడం లేదని వివరించారు. ఎన్నికల కోడ్‌?లో ఇరికించకుండా ధాన్యానికి బోనస్‌ ఇవ్వాలని కోరారు. అసలు డబ్బులు తమ ఖాతాల్లోకి వస్తాయా రావా అని రైతులు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మీకు చిత్తశుద్ది ఉంటే వెంటనే అమలు చేయాలని నిలదీశారు.ఛత్తీస్‌ ఘడ్‌ లో ఎకరానికి 13 క్వింటాల్‌ కు మాత్రమే 500 బోనస్‌ ఇస్తోంది మిగితా ధాన్యానికి ఇవ్వటం లేదని తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి తీసుకొచ్చేలా కాంగ్రెస్‌ ఆలోచన చేస్తున్నట్లుందని ఆరోపించారు. కరోనా సమయంలో అన్ని పథకాలను ఆపినప్పటికీ రైతు బంధు ఆపలేదని గుర్తు చేశారు. నిజం గా ఆరు గ్యారంటీ అమలు చేయాలనే చిత్తశుద్ది ఉంటేనే వెంటనే జీవో విడుదల చేసి ఇవ్వొచ్చు అని తెలిపారు. ఆరోగ్య శ్రీ కింద ఇప్పటి వరకు ఎంత మందికి 10 లక్షలు ఇచ్చారు? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి విషయంలో భట్టి విక్రమార్క మేము హామీ ఇవ్వలేదు అంటు న్నారు.. ఎన్నికల ప్రచారంలో ప్రియాంకా గాంధీ అమలు ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు