Wednesday, May 15, 2024

నేనే సర్పంచ్..? నేను చెప్పిందే వేదం!

తప్పక చదవండి
  • గ్రామ సర్పంచ్ భర్త ఆగడాలు..
  • జిల్లా అధికారికి ఫిర్యాదు..
  • షోకాజు నోటీసులు జారీ..

జనగామ : జనగామ జిల్లా, జనగామ మండలంలో ఎర్రోగొల్ల పహడ్ గ్రామ సర్పంచ్ భర్త శంకర్.. నాకు నినే మంత్రి.. నాకు నేనే ఈ ఊరికి హీరోను అంటూ దర్జాగా అతను చేస్తున్న ఆగడాలకు అంతులేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. సర్పంచ్ భర్త గ్రామ పంచాయతీలో నేను చెప్పిందే వినాలి.. నేనే సర్పంచ్ అంటూ గ్రామ సిబ్బందిని, సెక్రటరీని, మిగితా సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారు.
శంకర్ కు ఏమీ అధికారం లేకున్నా, గ్రామ బాడీ మీటింగ్ లోకి వచ్చి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సెక్రటరీ, గ్రామ సిబ్బంది మధ్యలో కూర్చొని నేను చెప్పిందే వినాలి.. లేకుంటే సిబ్బంది మొత్తాన్ని తీసేస్తాను అంటూ బెదిరిస్తూ ఉన్న ప్రూఫ్ తో కలిపి ఒక దరఖాస్తుని జిల్లా అధికారికి పూర్తి సమాచారంతో పిర్యాదు చేయగా.. అధికారులు గ్రామంలో ఎంక్వయిరీ చేసి అన్నీ పరిశీలించి.. సర్పంచ్ భర్త శంకర్ పై పిర్యాదుదారుడు ఇచ్చిన దరఖాస్తు వాస్తవం అని తేల్చి అధికారులు సర్పంచ్ భర్త శంకర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. కనుక అధికారులు తక్షణమే సర్పంచ్ ను సస్పెండ్ చేయాలని గ్రామ ప్రజలు, దరఖాస్తు దారుడు అధికారులను కోరుకుంటున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు