Friday, July 19, 2024

సీఏలు దేశ ఆర్దిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు..

తప్పక చదవండి


( ఐసీఏఐ స్నాతకోత్సవంలో బండి సంజయ్ వ్యాఖ్యలు.. )

 • మీరు సక్రమంగా పన్నులు కట్టిస్తుండటంవల్లే ఈ దేశం పురోగమిస్తోంది
  -2047 నాటికి భారత్ ను నెంబర్ వన్ చేసే మోదీ క్రుషిలో భాగస్వాములు కండి
 • భారత్ ను అగ్ర దేశంగా చూసేది…చేసేది…అనుభవించేది కూడా మీరే
 • మోదీ పాలనలో విపరీతంగా పెరిగిన దేశ ఆర్దిక ప్రగతి
 • 48.75 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు తెరిపించి
  రూ. 2 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ కు కారకులు మోదీ
 • పాస్ పోర్ట్ నిరాకరించిన దేశాలే ఆయనకు రెడ్ కార్పెట్ తో
  స్వాగతం పలుకుతున్నాయి
 • విదేశీ పెట్టుబడుల్లో మీ పాత్ర అత్యంత కీలకం..
 • అద్బుత ప్రసంగంతో విద్యార్థులను కట్టిపడేసిన బండి సంజయ్

( సీఏ లంటే అకౌంటెంట్లు మాత్రమే కాదు.. దేశ ఆర్దిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడార్లు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ కుమార్..)

- Advertisement -

హైదరాబాద్, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తమ క్లయింట్లతో సక్రమంగా పన్నులు కట్టిస్తుండటంవల్లే ఈ దేశం ప్రగతి పథంలో దూసుకుపోవడమే కాకుండా… ఈ దేశంలోని పేదలకు రేషన్, ఇండ్లు నిర్మించడంతోపాటు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించగలుగుతోందనే విషయాన్ని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక భారత ఆర్దిక వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయని, 10వ స్థానంలో ఉన్న భారత్ 5వ స్థానానికి చేరుకుందన్నారు. 2047 నాటికి భారత్ ను నెంబర్ వన్ చేయాలనే సంకల్పంతో మోదీ రాత్రింబవళ్లు క్రుషి చేస్తున్నారని, ఈ ప్రగతిలో మీరంతా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భారత్ ను అగ్ర దేశంగా చూసేది… చేసేది… అనుభవించేది కూడా మీరేనని చెప్పారు..

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్నాతకోత్సవ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్నాతకోత్సవానికి హాజరైన వేలాది మంది సీఏ పట్టభద్రులు, వారి తల్లిదండ్రులతో శిల్పకళావేదిక కిక్కిరిసిపోయింది. వారిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగం చేశారు..

ఇంత మంచి కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషం. ప్రజల కోసం తపన ఉంది. సీఎస్సార్ ఫండ్స్ కావాలని కోరతాం. భారత జాతి నిర్మాతలైన మీ అందరికీ శుభాకాంక్షలు… స్టయిల్ గా మాట్లాడటం నాతో కాదు… నేను మాస్ లీడర్ నే. మీరు కూడా క్లాస్ లో మాస్…ఈ దేశానికి పేరు రావాలని సీఏ చేసిన వ్యక్తులు మీరు. సీఏ టఫ్ కోర్స్. నూటికి ఒక్కరు కూడా పాస్ కాలేని పరిస్థితి. పట్టుదల, కసితో పాసయ్యారు. మోదీ పేరు చెబితే అంతా చప్పట్లు కొడుతున్నరు. ఒక దేశ ప్రధాని మోదీ ది బాస్ అంటే… ఇంకో ప్రధాని ఏకంగా పాదాభివందనం చేస్తున్నారు. విదేశాల్లో ప్రధానికి గౌరవం తగ్గిందంటే అది మనందరికీ గౌరవం దక్కినట్లే.. కానీ కొన్ని పార్టీలు ఆయన ఇమేజ్ ను తగ్గించే ప్రయత్నం చేయడం బాధాకరం. గతంలో ఇదే మోదీకి పాస్ పోర్టు ఇవ్వబోనని నిరాకరించిన దేశాలే.. ఇయాళ రెడ్ కార్పెట్ వేసి ఘన స్వాగతం పలుకుతున్నాయి. నిరంతరం దేశం ఆలోచించే మోదీ నాయకత్వంలో నేను ఎంపీగా ఉన్నందుకు గర్వంగా ఉంది. నన్ను ఎంపీగా చేసిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా. మోదీ పీఎం అయ్యాక దేశ ఎకానమీ గ్రోత్ విపరీతంగా పెరగింది. ఆజాద్ కా అమ్రుతోత్సవం నుండి అమ్రుత్ కాల వైపు పయనిస్తున్నాం. ఇయాళ దేశ ఆర్దిక పరిస్థితి గతంలో 10వ స్థానంలో ఉండే… ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చినం. 2047 నాటికి భారత్ నెంబర్ వన్ చేసేందుకు క్రుషి చేస్తున్నారు. ఆ కలను కళ్లారా చూసేది మీరే…చేసేది మీరే… ఆ ఫలాలను అనుభవించేది కూడా మీరే… ఈ దేశం ఆర్దికంగా అభివ్రుద్ధి చెందడంలో మీ పాత్ర కీలకం. ఒకప్పుడు ట్యాక్స్ పేయర్స్ ను దొంగలుగా చూసేవాళ్లు. సకాలంలో పన్ను కట్టకపోతే నేరంగా చూసేవాళ్లు. మోదీ వచ్చాక ఇట్లాంటి 3400 క్లాజులను మార్చేశారు. 42 చట్టాలను సవరించారు. టాక్స్ పేయర్స్ ను గౌరవిస్తున్నారు. సీఏ అంటే అకౌంట్స్ చేసేవాళ్లు మాత్రమే కాదు… మాలాంటి సామాన్యులంతా 10 మైనస్ 2 అంటే 8 అని చెబుతాం… మీరు మాత్రం మీకెంత కావాలో చెప్పండి అని అంటారు… కానీ మీరంతా ఈ దేశ భవిష్యత్తు తలరాతను మార్చే సత్తా మీకే ఉంది. మీ క్లయింట్స్ సకాలంలో పన్నులు కట్టేలా చూడండి. బ్లాక్ మనీని అరికట్టండి. వారికి సిస్టమ్ తో సమస్యలొస్తే… వాటిని తొలగించి సంస్థ ఉన్నతికి తోడ్పడండి. ఇయాళ విదేశీ పెట్టుబడులు మాతోనే వచ్చాయని రాజకీయ నాయకులుగా మేం చెప్పుకుంటాం… కానీ మీవల్లే పెట్టుబడులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇండియా అంటే సేఫ్ జోన్ గా చూపాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒక బిజినెస్ చేయాలంటే ఈ ప్రాంతం సేఫ్ జోనా? కాదా? పొరపాటున నష్టాలొస్తే ఇబ్బందులు పెడతారా? అనుకోకుండా నష్టాలొస్తే సేఫ్ గా ఎగ్జిట్ కావొచ్చా? అని విదేశీయలు చూస్తారు. ఆ నమ్మకం మీరు కలిగించాలి. మోదీ రాకముందు కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లు కూడా లేవు. ప్రధాని అయ్యాక మోదీ ఏకంగా 48 కోట్ల 75 లక్షల మందికి జీరో బ్యాలెన్స్ తో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అందులో 56 శాతం మంది మహిళలున్నారు. ధన్ జన్ ఖాతాల వల్ల 2 లక్షల కోట్ల ట్రాన్జాక్షన్స్ జరుగుతున్నాయి. ఈ దేశ ఆర్దిక వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు మీరు. మీ క్లయింట్లను ప్రోత్సహిస్తూ కట్టిస్తున్న పన్నుల వల్లే ఈ దేశంలో 80 కోట్ల మంది పేదలకు మూడు పూటల భోజనం అందిస్తున్నారు. 3 కోట్ల మందికి ఇండ్లు కట్టిస్తున్నాం. జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేలా టాయిలెట్లు కట్టించాం. గతంలో ఇండియన్స్ అంటే పాములు పట్టేవాళ్లు.. మూర్ఖులు..అజ్ఝానులనే భావన ఉండేది.. ఇప్పుడు విజ్ఝానంలో టాపర్స్ గా గుర్తిస్తున్నారు. మరో 20 ఏళ్లలో దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు మోదీ చేస్తున్న క్రుషిలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. మీ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరుకుంటున్నా. దయచేసి భయపడకండి. కసితో పనిచేయండి. అనుకున్న లక్ష్య సాధన కోసం ఎంత కష్టమైనా అధిగమిస్తూ ముందుకు వెళ్లాలి. నేను భయపడను. ఇప్పటి వరకు 7 సార్లు జైలుకు పోయిన. నాపై విపరీతమైన కేసులున్నయ్. చాలా మంది హేళనగా చూసేవాళ్లు… అయినా భయపడే వ్యక్తిని నేను కాదు… నేను ప్రతి క్షణం ఈ దేశం, ధర్మం, పేదల కోసం పనిచేయాలనే తపనతోనే ముందుకు వెళతా..

సీఏలు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయి :
ఛార్టెట్ అకౌంటెంట్లు తలుచుకుంటే ప్రభుత్వాలే గల్లంతవుతాయని బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, కాగ్ ఇచ్చిన నివేదికలతోనే 2జీ స్కాం, బొగ్గు స్కాంలు బయటపడ్డాయని అన్నారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ అడ్రస్సే గల్లంతైన విషయాన్ని గుర్తు చేశారు. ఐసీఏఐ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. సీఏ పట్టభద్రుల ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ దేశ ఆర్దిక ప్రగతిని బ్రాండ్ అంబాసిడర్లు…. నవ భారత జాతి నిర్మాతలు సీఏలని అభివర్ణించారు. తమ క్లయింట్ల విషయంలో నిజాయితీగా పనిచేయాలని, లాభాలొచ్చినా, నష్టాలొచ్చినా వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం సీఏలపై ఉందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు