Saturday, March 2, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

దశాబ్ది ఉత్సవాలు దేనికి ?
1200 మంది అమరవీరుల ఆశయాలు నెరవేర్చనందుకా?
ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టినందుకా?
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకా?
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీలతో పేదలను మోసం చేసినందుకా?
దళితులకు మూడెకరాల భూమి అంటూ
ఎకరం భూమి కూడా పంచనందుకా?
గొల్ల – కురుమలకు, బెస్త – ముదిరాజులకు,
మాల – మాదిగలకు, ఆదివాసి-గిరిజనులకు
చిచ్చు పెట్టినందుకా?
ధరణి పేరుతో పేదల భూములు కొల్లగొట్టినందుకా?
ఆ బంధు, ఈ బంధు అంటూ అమలు కానీ
హామీలతో ఓట్ల వేట కోసం బయలుదేరినందుకా?
ఏ పేదోడికి కడుపు నిండిందని ఏ అన్నదాత
ఆకలి తీరిందని ఈ దశాబ్ది ఉత్సవాలు
సారు నీ మర్మం ఎరిగితిమి ఇక సాగవు
ఆటలు జర సదురుకో….

  • బొమ్ము ఆంజనేయులు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు