Wednesday, May 8, 2024

అవినీతి కంపుకు అడ్డుకట్ట వేయలేమా..!

తప్పక చదవండి

ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనుపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారి పోతున్నదా. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది. అక్రమార్కులు పేట్రేగా పోతున్నారు. లంచగొండుతనం రాజ్యమేలుతున్నది. ఆకలి కన్న తీవ్రమైన సమస్యగా అవినీతి నిలబడి ఉన్నది. లంచం ఇవ్వనిదే ఫైలు కదలనంటున్నది. అమ్యామ్యాల మేతతో అక్రమార్కులు బలిసి పోతున్నారు. అక్రమార్జనలే నవ్య నాగరికత అవుతున్నది. అధికారం అవినీతికి రాచబాట అయ్యింది. కీచక రాజకీయ నాయకుల ఆదేశాలే అలిఖిత చట్టాలు అయ్యాయి. నీతిమంతుడు చేతకాని వాడుగా పరిగణించబడుతున్నాడు. అవినీతి, లంచగొండితనం అనేవి సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలుగా అవతరించాయి. అవినీతి రహిత సమాజ స్థాపనకు పూనుకోవడం, మూలాలను అన్వేషించడం, అక్రమార్కులను శిక్షించడం, చట్టాలను రూపొందించి కఠినంగా అమలుపరచడం లాంటి పలు అంశాలను చర్చించే ఐరాస వేదికగా ‘‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని’’ ప్రతి ఏట 09 డిసెంబర్‌న 2005 నుంచి పాటించుట ఆనవాయితీగా మారింది.
రాజ్యమేలుతున్న అవినీతి చెదలు: ఐరాస గణాంకాల ప్రకారం ప్రతి ఏట 1 ట్రిలియన్‌ డాలర్లు అవినీతిపరుల జేబులకు చేరుతూ, 2.6 ట్రిలియన్‌ డాలర్లు అక్రమ మార్గంలో దోపిడీ చేయబ డుతున్నాయి. ప్రపంచ జిడిపిలో 5 శాతం వరకు అవినీతిపరుల చేతులు మారుతున్నది. మానవాళి సమగ్రాభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలుస్తున్న అవినీతి అంతానికి ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, బాధ్యతగల పౌరులు, ప్రైవేట్‌ సంస్థలు తమవంతు చేయూతను ఇవ్వాలి. అవినీతి పెరిగితే పేదరికం, అశాంతి, హింస, ఆర్థిక మందగమనం, నేర ప్రవృత్తి, ఆకలి చావులు, ఆర్థిక అసమానతలు రాజ్యమేలుతాయని చరిత్ర బోధిస్తున్నది. నేర చరితులే నవ నాయకులుగా అవతార మెత్తుతున్నారు. అవినీతితో ప్రజాస్వామ్యం పరిహాసించబడడం, ప్రభుత్వాలు అస్థిరత్వం పాలుకావడం, దేశ ప్రగతి తిరోగమన దిశగా కదలడం జరుగుతాయి. చట్టాల లొసుగుల్ని గమనించడం, రంధ్రాన్వేషణ చేయడం, అధికారంతో రక్షణ పొందడం, పౌరుల అవసరాలను అలుసుగా తీసుకోవడం, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి, లంచం తీసుకోవడం, భావ కాలుష్యం లాంటివి అవినీతి దురాచారాలుగానే పరిగణించ బడతాయి. అవినీతి, అధికార దుర్వినియోగాలు వ్యక్తి స్వేచ్ఛ, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, మానవ హక్కులు, సామాజిక న్యాయం, ప్రభుత్వ పాలన, సమాజ భవిష్యత్తులకు విఘాతంగా మారుతున్నాయి.
ప్రపంచ దేశాల ‘కరప్షన్‌ పర్‌సెప్షన్‌ ఇండెక్స్‌, సిపిఐ’: ప్రపంచ దేశాల్లో అవినీతిని కొలువడానికి ‘‘కరప్షన్‌ పర్‌సెప్షన్‌ ఇండెక్స్‌ (సిపిఐ)’’ సూచిక ద్వారా నిర్ణయించిపోలుస్తారు. సిపిఐ 100 ఉన్న దేశాన్ని అవినీతిరహిత దేశంగా, 0 ఉన్న దేశాన్ని అత్యంత అవినీతి కలిగిన దేశంగా వర్గీకరిస్తారు. సిపిఐ వివరాల ప్రకారం డెన్మార్క్‌ (సిపిఐ 88), న్యూజీలాండ్‌ (88), ఫిన్‌లాండ్‌ (88), సింగ పూర్‌ (85), స్వీడెన్‌(85), నార్వే (85), స్విస్‌ (84), నెథర్‌లాండ్‌ (82), జర్మనీ (80)లు అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాలుగా తొలి 10 స్థానాలను దక్కించుకున్నాయి. అవినీతి అధికంగా ఉన్న దేశాలుగా ఇండియా (40), శ్రీలంక (37), నేపాల్‌ (33), పాకి స్థాన్‌ (28) లతో పాటు అత్యంత అవినీతి కలిగిన దేశాలుగా దక్షిణ సూడాన్‌ (సిపిఐ 11), సిరియా (13), సొమాలియా(13),వెనుజులా(14), నార్థ్‌ కొరియా(16), అఫ్ఘానిస్థాన్‌(16), లిబియా (17)దేశాలు జా బితాలో చివరన ఉన్నాయి. మ్నెత్రం 180 ప్రపంచ దేశాల జాబి తాలో సిపిఐ జాబితాలో ఇండియాకు 85వ స్థానం లభించింది.
అవినీతి భారతం: అవినీతి, లంచగొండితనం అధికంగా వ్యాపించిన భారతంలో నీతివంతమైన సమాజం మాయమైపో యింది. దేశ ప్రగతి నిరోధకంగా అవినీతి చెదలు నిలుస్తున్నది. దేశం ఎదుర్కొంటున్న అధిక జనాభా, నిరుద్యోగం, అవిద్య, వాతా వరణ కాలుష్యం, పేదరికం లాంటి సమస్యలకు అవినీతి కారణం అవుతున్నది. పోలీసు, రెవెన్యూ శాఖల్లో అవినీతి అనకొండలు బుసకొడుతున్నాయి. ప్రభుత్వ పథకాలు బడుగులకు చేరేసరికి సన్నబడుతున్నాయి. అక్రమార్కులను పట్టుకోవడం, లంచాల ఎర చూపి బయటపడడం సర్వసాధారణం అయ్యింది. అవినీతి వ్యతి రేక చట్టాలు మూలన పడి మూలుగుతున్నాయి. అధికారి నుంచి బంట్రోతు వరకు, వార్డు మెంబర్‌ నుంచి కేంద్ర మంత్రి వరకు అందరికీ అవినీతి మరకలు అంటుతూనే ఉన్నాయి. చేతులు తడ పందే ఫైలు కదలనంటోంది. తూకంలో మోసాలు, నకిలీ సామా న్లు, పన్ను ఎగవేతలు, కల్తీ లీలలు, ఆన్‌లైన్‌ మోసాలు లాంటివి సామాజిక ఆరోగ్యానికి పట్టిన తెగులుగా అవతరించాయి. నేర చరిత్రలే రాజకీయ నాయకుల అర్హతలు అయ్యాయి. భారత పార్ల మెంటులో 50శాతంవరకు యంపీలు నేరఆరోపణలు కలిగి ఉన్నా రని, 40మంది నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు నేరారో పణలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. దేశవ్యా ప్తంగా యంయ ల్‌ఏలు 4,442 కేసులను ఎదుర్కొంటున్నారు. అవి నీతికి వ్యతిరే కంగా ఏకమవుతూ పోరు బాటపడదాం.నైతికత,పార దర్శ కత, దేశభక్తి, చట్టాల పట్ల గౌరవం, జవాబుదారీతనం, అం కిత భావం పెరగాలి. నీతివంతమైన భారత నిర్మాణానికి మనం దరం పూను కుందాం, అవినీతిరహిత సమాజస్థాపనకు ప్రతిన బూనుదాం.
` డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు