Monday, May 20, 2024

కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో 100 స్థానాలతో బి ఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యం..

తప్పక చదవండి
  • తేల్చిచెప్పిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ చాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు..

హైదరాబాద్ :
కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో 100 స్థానాలతో బి ఆర్ ఎస్ హ్యాట్రిక్ విజయం తధ్యమని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పేర్కొన్నారు.. తెలంగాణ మున్సిపల్ చైర్మన్ ఛాంబర్స్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఛాంబర్ లో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి చర్చించడం జరిగింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ కేసీఆర్ దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని ప్రదర్శించి 115 మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చైర్మన్ లకు శాసనసభ్యులకు అనేక అంశాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయని పార్టీ నాయకత్వం జోక్యం చేసుకొని సమన్వయం చేయాలని సమావేశం కోరింది. 2019 చట్టాన్ని సవరించి బాధ్యతలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పెంచేలా చూడాలని, రానున్న కాలంలో జరుగు మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవికి నేరుగా ఎన్నికలు జరిగేలా చట్ట సవరణ చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. చైర్మన్ లకు కౌన్సిలర్లకు గౌరవ వేతనాన్ని మరింత పెంచాలని, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో చైర్మన్లు, కౌన్సిలర్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశం కోరింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు చైర్మన్ లందరూ క్రియాశీలక పాత్ర పోషించాలని సమావేశం తీర్మానించింది. భవిష్యత్తులో మున్సిపల్ చైర్మన్ లకు ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎంపి స్థానాల్లో తగు ప్రాతినిధ్యాన్ని కల్పించాలని సమావేశం తీర్మానించింది.రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను త్వరలో కలిసి నివేదించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో కార్యదర్శి ఎడమ సత్యం, ఉపాధ్యక్షురాలు మంజుల, మున్సిపల్ చైర్మన్లు కేశవ్, రాజమౌళి గుప్త, జమున, నరేందర్,, సుష్మ, స్వప్న, ప్రణీత, కల్పన, కప్పర స్రవంతి, రజని, విజయలక్ష్మి, శంకర్, ఆర్ఎస్ కర్ణ, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు