Tuesday, April 30, 2024

విద్యార్థులు ఎటుపోతే నాకేంటి…!

తప్పక చదవండి
  • విధులు మరచిన వార్డెన్‌
  • కానరాని విద్యార్థుల సంరక్షణ
  • ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లో వసతిగృహం
  • రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్న విద్యార్థులు

వసతి గృహంలోని విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సంక్షేమ అధికారి(వార్డెన్‌) విధులు మరిచాడు.ఆ విద్యార్థులు ఎటుపోతే నాకేంటి అని పర్యవేక్షణను గాలికి వదిలేశాడు.ప్రయివేట్‌ వ్యక్తులకు వసతి గృహం విద్యార్థులను అప్పజెప్పి విధులకు డుమ్మా కొడుతున్నాడు. అడిగేవారు లేకపోవడంతో వార్డెన్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం తిరుమలాయపాలెం (సుబ్లేడు)మండలంలోని ప్రభుత్వ బాలుర గిరిజన వసతి గృహంలో ఆలస్యంగా వెలుగు చూసింది. నిరుపేద గిరిజన విద్యార్థులను హాస్టల్‌ లో సంరక్షించాల్సిన వార్డెన్‌ ప్రతాప్‌ సింగ్‌ విధులు ఎగ్గొడుతూ ప్రయివేటు వ్యక్తులతో హాస్టల్‌ ను నడిపిస్తుండడంతో విద్యార్థుల సంరక్షణ ప్రశ్నార్థకమైంది.ప్రయివేట్‌ వ్యక్తుల ప్రమేయంతో విద్యార్థులు భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది.పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులు రాత్రి వేళల్లో యధేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా చదువుకుని,బంగారు భవిష్యత్తు నిర్మించుకుంటారనే ఆశతో హాస్టల్‌ లో చేర్పిస్తే వారిని సంరక్షించాల్సిన వార్డెన్‌ ప్రతాప్‌ సింగ్‌ విద్యార్థుల భవిష్యత్‌ తో ఆడుకుంటున్నాడు.చుట్టం చూపుగా విధులకు హాజరు అవుతూ విద్యార్థులను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో బంధీ చేశాడు.సదరు వార్డెన్‌ కి జీతం పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల పై సంరక్షణ లేకపోవడంతో కొందరు దురలవాట్లకు అలవాటు పడుతున్నారు.

ఓ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న ప్రయివేట్‌ వ్యక్తి..
గిరిజన సంక్షేమ వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి స్థానంలో ప్రయివేట్‌ వ్యక్తిని నియమించి అతనితోనే అన్ని రకాల విధులను వార్డెన్‌ ప్రతాప్‌ సింగ్‌ నిర్వహింపచేస్తున్నాడు.మండలంలోని ఇస్లావత్‌ తండా గ్రామానికి చెందిన ఓ యువకుడితి అక్రమ పద్ధతిలో హాస్టల్‌ లో పెట్టీ అన్ని పనులు చేయిస్తున్నాడు.సదరు ప్రభుత్వ ఉద్యోగి నుండి అమ్యామ్యాలు తీసుకుని ప్రయివెట్‌ వ్యక్తులను ప్రోత్సహిస్తూ ఉన్నతా ధికారులను బురిడీ కొట్టుస్తున్నాడు.దీనికి తోడు నిబంధనల ప్రకారం ట్యూటర్లను సైతం నియమంచలేదని సమాచారం.జిల్లా కలెక్టర్‌ విపి గౌతమ్‌, ఐటిడిఏ అధికారులు స్పందించి విద్యార్థుల పర్యవేక్షణను మరచి ప్రయివేట్‌ వ్యక్తిని నియమించిన విషయం పై విచారణ జరిపి వార్డెన్‌ ప్రతాప్‌ సింగ్‌ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు