Sunday, October 13, 2024
spot_img

శిధిలావస్థకు విద్యాలయం

తప్పక చదవండి
  • ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేర్చిన పాఠశాల
  • అభివృద్ధికి నోచుకోని పాఠశాల
  • భయం భయంగా విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామని పాలకులు, అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి కేవలం మాటలకు పరిమితమవుతున్నాయి. నాయకులు అధికారులు చెప్పిన మాటలకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిన దాఖలలు కనిపించడం లేదు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్‌ ఉన్నత ప్రాథమిక బాలుర పాఠశాల భవనం పరిస్థితి అధ్వానంగా మారింది. భవనం శిధిలావస్థకు చేరడంతో అక్కడక్కడ పై పెచ్చులు ఊడి పడుతున్నాయి. అంతేకా కుండా వందల సంఖ్యలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న పాఠశాలలో వసతులకు నోచుకోవడం లేదు. అధికారులు అలసత్వం కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు మెగ్గు చూపడం లేదు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించలేక పోతే ఎలా విద్యార్థులను పాఠశాలకు పంపిస్తామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో చదివించలేక, ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లలను పంపిస్తున్నామని. కానీ పాఠశాల తెరిచి చూస్తే ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంటుంది.పాఠశాల పరిస్థితి చూస్తే పైనుంచి ఎప్పుడు పెంచులు ఊడి పడతాయి నీ భయాందోళన చెందే పరిస్థితి నెలకొంది. ఈ పాఠశాల జిల్లా కేంద్రంలో అభివృద్ధికి నోచుకోకుండా స్థిలావస్థకు చేరిపోతుంది. అయినప్పటికీ నాయకులు అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు