Wednesday, April 24, 2024

రోడ్లు, ఫుట్‌ పాత్‌లపై దళారుల దందా..

తప్పక చదవండి
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ కష్టాలు
  • ట్రాఫిక్‌ పోలీసులకు వాటాలు..?

సికింద్రాబాద్‌ స్టేషన్‌, 31 బస్టాప్‌, మోండా మార్కెట్‌, ఆల్ఫా హోటల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫుట్‌ పాత్‌ పై కొన్ని వందల ఆక్రమణలు వెలిశాయి.. అటు జీహెచ్‌ఎంసీ ఇటు ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోక పోవ డంతో రోజు రోజుకు ఇవి పెరిగిపోతున్నాయి. వాహన దారుల ట్రాఫిక్‌ కష్టాలను పోలీసులు గాలికి వదలి వేశారు.. జీహెచ్‌ఎంసీ అధికారులకు అసలు ఈ విషయం పెట్టడమే లేదు. ఇక్కడ కొన్నీ ఏళ్లుగా చిరు వ్యాపారులు పొట్ట కూటి కోసం ఏదైనా వ్యాపారం చేసికొని కుటుంబాన్ని జీవనం సాగిస్తున్నారు. కానీ కొంతమంది స్థానిక లీడర్లు,అంగబలం ఉన్నవాళ్లు రోడ్లు ఆక్ర మించి, విక్ర యించి రోజుకు వేలరూపాయలు సంపాదిస్తు న్నారు. ఇలాంటి వారిని కూడా చూసిచూడనట్లు అధికారులు వ్యవహ రిస్తుండ టంతో రోడ్లు,ఫుట్‌ పాత్‌లు వీరి ఆక్రమణలోకి వెళ్తున్నాయి. ఇప్పుడైనా అధికారులు కళ్ళు తెరువకపోతే ఈ రోడ్లపై వాహనాలు కాదు అన్నీ వ్యాపారాలే కనిపించే రోజు దగ్గర్లోనే ఉంది.
ముందే ఎందుకు అడ్డుకోవడం లేదు.. ట్రాఫిక్‌, జీహెచ్‌ ఎంసీ అధికారులు ఇలాంటి ఆక్రమణలను ముందే ఎందుకు అడ్డు కోవడం లేదనే ప్రశ్న సామాన్యుల నుంచి వస్తుంది. ఇలా ఫుట్‌ పాత్‌ ఆక్రమించి విక్రయించే రోజుకు వేల రూపాయలు సంపా దించే బ్రోకర్లు తెల్లవారి లేస్తే ఏ రోడ్డు ఆక్రమించి విక్రయించాలా అని వెతుకుతుంటారు. ఉన్న వాటిని వదలి పెట్టి కొత్తగా వెలుస్తున్న అక్రమణలపై పోలీసులు దృష్టి పెట్టాలని లేకపోతే ఉన్న రోడ్లు, ఫుట్‌ పాత్‌లు మిగిలే పరిస్థితి లేదని వాహనదారులు అంటున్నారు. 31 బస్టాప్‌ వద్ద ఇటీవల ట్రాఫిక్‌, జీహెచ్‌ ఎంసీ అధికారులు ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో బస్టాప్‌ చుట్టు ఉన్న ఆక్రమణలు తొలగించారు. కానీ మాళ్లీ యధావిధిగా అవి వెలిశాయి. అంతే కాదు తొలగించిన వారం లోపు అంతకు ముందు కంటే ఎక్కువగా వెలిశాయి. . ఇప్పటికే ఓ పది అడ్డాల నుంచి వసూళ్లు చేస్తున్న కొందరి కన్ను ఖాళీగా కనబడుతున్న రోడ్డు మీద పడిరది. ఇక్కడే ఇలాంటి ఓ దళారి ఖాళీగా ఉన్న స్థలంలో ముందుగా విరిగిపోయిన బండ్లను పెట్టి అడ్డా సెట్‌ చేసికున్నాడు ఓ వ్యక్తి నుంచి రోజుకు కొంత మాట్లాడుకుని అక్కడ బండి పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. కొత్త బండిని సిద్ధం చేసికొని ఉంచాడు. రాత్రికి, రాత్రి బండి వెలుస్తుంది. ఈ అడ్డా మాదని, ఎప్పటి నుంచో ఉందని దాబాయిస్తారు. అందుకే ఇలా మొదట్లోనే అడ్డుకుంటే ఇప్పుడు ఇంతలా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండేవి కావు.
నిత్యం ట్రాఫిక్‌ జంజాటం.. మోండా మార్కెట్‌, 31బస్టాప్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రోడ్‌ లలో ఇలా వేల సంఖ్యలో ఫుట్‌ పాత్‌ ఆక్రమణలు వెలియడంతో ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఉదయం, సాయంత్రమే కాకుండా అన్ని వేళలా ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు. ఇక ట్రాఫిక్‌ పోలీసులు అడ్డాకు కొంత చొప్పున మాట్లాడుకుని వసూళ్లు చేస్తూట్లు ఆరోపణలు ఉన్నాయి….వాహనదారులు సమస్యను గాలికి వదలి వేశారని బహిరంగనే వాహనదారులు చెబుతున్నారు.. ఇప్పటికైనా జిహెచ్‌ఎంసి ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించి ఫుట్పాత్లపై అక్రమంగా వెలసిన డబ్బాలను…. ఆక్రమణలను తొలగించాలని స్థానికులు….డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు